Breaking News

లెక్కింపునకు సిబ్బంది కేటాయింపు, ర్యాండమైజేషన్‌ పూర్తి

నిజామాబాద్‌, జూన్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక సంస్థల లెక్కింపుకు సంబంధించి సిబ్బంది ర్యాండమైజేషన్‌ పూర్తి చేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీలో కౌంటింగ్‌ సిబ్బంది కేటాయింపులకు సంబంధించి కంప్యూటర్‌ ద్వారా ర్యాండమైజేషన్‌ నిర్వహించారు. నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌ డివిజన్లకు వేరువేరుగా లెక్కింపు సిబ్బంది కేటాయించారు. నిజామాబాద్‌ డివిజన్‌కు 98 ఎంపీటీసీలకు, 538 పోలింగ్‌ కేంద్రాలలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 184 టేబుల్స్‌ ఏర్పాటు చేస్తుండగా ఇందుకుగాను ఒక్కో టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్‌ చొప్పున, అదనంగా 10 శాతం కలిపి 201 సూపర్‌వైజర్లు, 403 మంది సహాయకులను, మొత్తం 604 కౌంటింగ్‌ సిబ్బందిని నియమించారు.

బోధన్‌ డివిజన్‌కు 412 పోలింగ్‌ కేంద్రాలలో 75 ఎంపీటీసీలకు ఎన్నిక నిర్వహించగా ఇందుకుగాను 150 టేబుల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు, 165 మంది సూపర్‌వైజర్లు, 330 మంది సహాయకులు మొత్తం 495 మందిని నియమించారు. ఆర్మూర్‌ డివిజన్‌లో 639 పోలింగ్‌ కేంద్రాలలో 124 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగగా 248 టేబుల్స్‌ ఏర్పాటు చేసి 274 మంది సూపర్‌వైజర్లను, 545 మంది సహాయకులను మొత్తం 819 మంది కౌంటింగ్‌ సిబ్బందిని నియమించారు.

జిల్లా మొత్తానికి 1589 పోలింగ్‌ కేంద్రాలలో 297 ఎంపీటీసీలకుగాను 582 టేబుల్స్‌ ఏర్పాటు చేసి 640 మంది సూపర్‌వైజర్లను 1278 సహాయకులను మొత్తం 1918 మంది కౌంటింగ్‌ సిబ్బందిని 10 శాతం అదనంగా కలిపి నియమించారు.

కౌంటింగ్‌ సిబ్బంది కేటాయింపు ప్రక్రియ కంప్యూటర్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు పర్యవేక్షణలో ర్యాండమైజేషన్‌ పూర్తి చేశారు. కౌంటింగ్‌ విధులు నిర్వహించే సిబ్బంది ఉదయం ఆరు గంటలకే ఈనెల 4వ తేదీన సంబంధిత కౌంటింగ్‌ కేంద్రంలో రిపోర్ట్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ దిశగా జిల్లా పరిషత్‌ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని, సిబ్బంది రిపోర్ట్‌ చేసిన వివరాలను తెలపాలని ఆదేశించారు. కౌంటింగ్‌ సందర్భంగా సిబ్బంది కాని, అధికారులు కానీ ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటించాలని, ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. రాండమైజేషన్‌లో సీఈవో వేణు, డిప్యూటి సిఇఓ గోవింద్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రాజ్యాంగానికి అనుగుణంగా జీవనం సాగించాలి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం లింగంపేట్‌లో జరిగిన సమావేశంలో సర్పంచ్‌కు కాంస్టిట్యూషన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *