Breaking News

ఇంటర్‌ సప్లమెంటరీకి సరైన ఏర్పాట్లు

నిజామాబాద్‌, జూన్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 7 నుండి జరిగే ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7 నుండి 14 వరకు జరిగే ఇంటర్మీడియట్‌ అడ్వాన్సుడు సప్లమెంటరీ పరీక్షలకు అవసరమైన అన్ని రకాల పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.

విద్యార్థులకు అవసరమైన సదుపాయాలతోపాటు జిరాక్స్‌ సెంటర్లను మూసి ఉంచాలని, సెక్షన్‌ 144 పరీక్ష కేంద్రాల వద్ద అమలు చేయాలని, పకడ్బందీగా పరీక్షల నిర్వహణ జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు వివరిస్తూ సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశామని తపాల శాఖ, పోలీస్‌, రవాణా, ఇతర శాఖల అధికారులతో అవసరమైన ఏర్పాట్లకు ఆదేశించామన్నారు. పకడ్బందీగా పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, పరీక్షలు రాసే విద్యార్థులకు అవసరం మేరకు ఆర్టీసీ బస్సులు, పరీక్ష కేంద్రాల వద్ద త్రాగునీరు, వైద్య సదుపాయం అవసరమైన కుర్చీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

అంతేకాక పోలీస్‌ అధికారుల ద్వారా పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు, జిరాక్స్‌ కేంద్రాల మూసివేత తదితర ఏర్పాటును పర్యవేక్షిస్తున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్సులో ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ అశోక్‌ పరీక్షల నిర్వహణపై పలు సూచనలు చేశారు. జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి ఒడ్డెన్న, అడిషనల్‌ డిసిపి శ్రీధర్‌ రెడ్డి, జిల్లా వైద్య శాఖ అధికారి సుదర్శనం, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రాజ్యాంగానికి అనుగుణంగా జీవనం సాగించాలి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం లింగంపేట్‌లో జరిగిన సమావేశంలో సర్పంచ్‌కు కాంస్టిట్యూషన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *