Breaking News

విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పరీక్షల ఏర్పాట్లు చేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షల కోసం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. సోమవారం ఉదయం ప్రగతిభవన్‌లో ఇంటర్మీడియట్‌ పదో తరగతి అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో 979 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని చెప్పారు.

పరీక్షలు ఈనెల 10 తేదీ నుండి 24వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుండి 12.15 గంటల వరకు ఉంటాయని, హిందీ పరీక్ష మాత్రం 12.45 వరకు జరుగుతుందన్నారు. గత సంవత్సరం 10వ తరగతి పరీక్షలలో కంటే జిల్లాలో ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు సాధించామని జిల్లాలో 97.12 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. సెన్సిటివ్‌ పరీక్ష కేంద్రాలు గుర్తించి అక్కడ బందోబస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిరాక్స్‌ మిషన్‌ షాపులను మూసి వేయాలని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ ప్రకటించాలని కలెక్టర్‌ పోలీస్‌ అధికారులను కోరారు.

ఈనెల 14వ తేదీ నుండి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాలు విజయవంతం చేయాలని బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలని ఈ విషయంలో ఉపాధ్యాయులు తమకు కేటాయించిన లక్ష్యాన్ని మించి బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలని బాలికలకు కస్తూరిబా గురుకుల పాఠశాలలు ప్రవేశం కల్పించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బడి బాట కార్యక్రమంలో రోజువారీ కార్యక్రమాలను వివరించిన నందున లక్ష్యం మేరకు ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరు కషి చేయాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 7 వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఉదయం మధ్యాహ్నం రెండు షిప్టులలో పరీక్షలు జరుగనున్నట్లు తెలిపారు.

ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుండి 5.30 గంటల వరకు జరుగుతుందని చెప్పారు. 33 పరీక్ష కేంద్రాల్లో 18 వేల 742 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని చెప్పారు. రీవెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ పత్రాలను స్కానింగ్‌ ప్రక్రియ మిగతా జిల్లాల కంటే మన జిల్లాలోని ముందుగా పూర్తి చేసినట్లు చెప్పారు. 18 వేల 742 మంది విద్యార్థులలో 12 వేల 833 మంది విద్యార్థులు ఉదయం, మధ్యాహ్నం 5909 విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణ ఏలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు లేని చోట ఏర్పాటు చేయాలని చీప్‌ సూపరింటెండెంట్‌లు, ఫ్లయింగ్‌ సిట్టింగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటు చేయాలని పరీక్ష సమయంలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జిరాక్స్‌షాప్‌లను మూసి వేయాలని, 144 సెక్షన్‌ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ చెప్పారు.

ఎండ ప్రభావం త్రీవంగా ఉన్నందున పరీక్ష కేంద్రాలలో త్రాగునీరు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఫస్ట్‌ ఎయిడ్‌ ఏర్పాటు చేయాలని పరీక్ష కేంద్రాల వరకు రవాణా సౌకర్యం అంతరాయం లేకుండా నిరంతరంగా విద్యుత్‌ సరఫరా చేయాలని సంబంధిత శాఖ అధికారులను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో డిఆర్‌ఓ అంజయ్య, డిఆర్‌డివో రాథోడ్‌ రమేష్‌, ఆర్టీవో డివిరెడ్డి, ఆర్‌ఐఓ ఒడ్డన్న, డిఈఓ దుర్గాప్రసాద్‌, జెడిఎ గోవింద్‌, 1వ టౌన్‌ సీఐ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

రాజ్యాంగానికి అనుగుణంగా జీవనం సాగించాలి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం లింగంపేట్‌లో జరిగిన సమావేశంలో సర్పంచ్‌కు కాంస్టిట్యూషన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *