Breaking News

ఉద్యోగ అవకాశాలు

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట, నిజామాబాద్‌ ప్రాంతాల్లో ఇంగ్లీష్‌ బోధించటానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరబడుచున్నవి. బి.ఇడి, ఎం.ఇడి, డిగ్రీ, పిజి అర్హత కలిగి, బోదనలో రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని దేశ్‌పాండే ఫౌండేషన్‌ నిర్వాహకులు తెలిపారు. సిద్దిపేట, నిజామాబాద్‌ చుట్టుపక్కల ప్రభుత్వ ఉన్నతపాఠశాలల్లో బోధించాల్సి ఉంటుందని, పిల్లలకు చదువు చెప్పాలనే కోరిక, తరగతి నిర్వహణ సామర్థ్యం కలిగి ఉండాలన్నారు.

9 వేల నుంచి 12 వేల వరకు వేతనం ఉంటుందని, మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఫౌండేషన్‌ వారు నిర్దేశించిన గ్రామంలో ఉంటూ ఉద్యోగం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూలు దేశ్‌ పాండే ఫౌండెషన్‌ కాకతియ సాడ్‌ బాక్స్‌, సుదీర్‌ రెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజ్‌, హైదారబాద్‌ రోడ్‌ ఈనాడు ఆఫిస్‌ ఎదురుగా, కేశాపూర్‌, నిజామాబాద్‌లో జరుగుతాయన్నారు. మరిన్ని వివరాలకు 9945892414 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *