Breaking News

ప్రశాంతంగా స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు

నిజామాబాద్‌, జూన్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నెలలో స్థానిక సంస్థలైన జెడ్‌పిటిసి, ఎంపీటీసీలకు 6, 10, 14 తేదీలలో నిర్వహించిన ఎన్నికలకు ఈనెల 4న మంగళవారం జిల్లాలోని మూడు డివిజన్లలో జరిగిన ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌ స్థాయిలో 297 ఎంపీటీసీలు, 26 జడ్పిటిసిలకు ఓట్ల లెక్కింపు ఆయా డివిజన్‌ పరిధిలో నిర్వహించగా కలెక్టర్‌ జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పరిశీలించారు. అనంతరం మూడు డివిజన్లలో లెక్కింపు కేంద్రాలలో పర్యటించి లెక్కింపును పర్యవేక్షించి అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ ఉదయం ఎనిమిది గంటలకి స్ట్రాంగ్‌ రూమ్‌లు తెరిచి ఓట్ల లెక్కింపును ప్రారంభించామని ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌లను లెక్కించాలని తెలిపారు. ఎంపిటిసి ఓట్ల లెక్కింపు తర్వాత ఆయా మండలాల జడ్పిటిసి ఓట్ల లెక్కింపును నిర్వహించడం జరిగిందన్నారు. ఎక్కడ ఎటువంటి సంఘటనలకు అవకాశం లేకుండా లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, సాఫీగా, సజావుగా ముగిసిందని, పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

ఈ ప్రక్రియ పూర్తి చేయడంలో అధికారులు, సిబ్బంది, పోలీసు శాఖ, పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అందరూ కూడా వారి వంతుగా తమ సహాయ సహకారాలు అందించారని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరుపేరునా కతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన తెలిపారు. ఇకముందు కూడా జిల్లా యంత్రాంగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి కూడా అందరూ సహకరించాలని ఆయన కోరారు.

Check Also

ప్రతి ఒక్కరు అల‌ర్ట్‌

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాల‌ని ...

Comment on the article