Breaking News

Daily Archives: June 5, 2019

రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య

కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వడియారం-మాసాయిపేట రైల్వేస్టేషన్‌ల మధ్య బుధవారం గుర్తు తెలియని వ్యక్తి (60) రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్టు కామారెడ్డి ఎస్‌ఐఆర్‌టి థావూనాయక్‌ తెలిపారు. మృతుని కాళ్లు, చేతులు, తల తెగిపడ్డాయని, సంఘటన స్థలంలోనే మృతి చెందాడని పేర్కొన్నారు. మృతుని షర్టుపై డిఆర్‌కె సికింద్రాబాద్‌ టైలర్‌ మార్కు ఉందన్నారు. మృతునికి తెలుపు గడ్డం, తెలుపు మీసాలు, సుంతి చేయబడి ఉందని వివరించారు. మృతుని గుర్తిస్తే 94407 00034 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం ...

Read More »

అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత

కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహబూబ్‌నగర్‌ నుంచి బీదర్‌కు అక్రమంగా తరలిస్తున్న 250.60 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని బుధవారం స్పెషల్‌ టాస్క్‌పోర్సు, విజిలెన్సు అదికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించి రామారెడ్డి రోడ్డులోగల గ్యాలక్సీ గార్డెన్‌ వద్ద లారీలో తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నట్టు తెలిపారు. లారీని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. దాడుల్లో హైదరాబాద్‌ స్పెషల్‌ ఫోర్సు శ్రీనివాస్‌, ఎన్‌ఫోర్సు మెంట్‌ డిటి చంద్ర రాజేశ్వర్‌, విజిలెన్సు ఏఎస్‌వో సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

పేద కుటుంబాలకు ఉచిత సామాగ్రి పంపిణీ

కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శాసనమండలి మాజీ ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ కుల, మతాలకు అతీతంగా పేదలకు రంజాన్‌ పురస్కరించుకొని పండగ సామాగ్రి, బియ్యం, తదితరాలను ఉచితంగా 5 వేల కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా షబ్బీర్‌ మాట్లాడుతూ రంజాన్‌ మాసం ముస్లింలకు పవిత్రమని, మాసంలో ప్రతి ఒక్కరు సాధ్యమైనంత వరకు పేదలు, వికలాంగులకు, అనాథలకు తమకు తోచిన దానం చేయాలని పేర్కొన్నారు. రంజాన్‌ మాసంలో ఉపవాసముంటే ఆకలిబాధ ...

Read More »

ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్‌, ఎస్‌పి

కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈద్గా వద్ద జరిపిన ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లింలు పాల్గొన్నారు. మాజీ శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌ అలీ సైతం అక్కడే ప్రార్థనలు చేశారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్‌పి శ్వేత, మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మతో పాటు ఇతర అధికారులు కలిసి పండగ శుభాకాంక్షలు తెలిపారు. పండగలను అందరు కలిసి నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని, కామారెడ్డి మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. అందరు సోదర భావంతో మెలగాలని ...

Read More »

ఘనంగా రంజాన్‌ వేడుకలు

కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో బుధవారం ముస్లింలు రంజాన్‌ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పండగ పురస్కరించుకొని ఈద్గా వద్ద అధికారులు ముస్లింల ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముస్లింలు ఈద్గా వద్దకెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హిందువులు సైతం ఈద్గావద్ద కెళ్ళి ముస్లింలను కలిసి రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యాన్ని చాటుకున్నారు. పండగ చేసిన సందర్భంగా చేసిన ప్రత్యేక వంటకాలను ఆరగించారు.

Read More »

ఘనంగా రంజాన్‌

నందిపేట్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పవిత్ర రంజాన్‌ పండుగ వేడుకలను బుధవారం ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రమైన నందిపేట్‌తోపాటు ఖుదావన్‌పూర్‌, డొంకేశ్వర్‌, నూత్‌పల్లి, వన్నెల్‌, మల్లారం తదితర గ్రామాల్లో ముస్లింలు ఈద్‌గాలలో ప్రత్యేక ప్రార్తనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని రంజాన్‌ పండుగ శుభాక్షాంలు తెలుపుకున్నారు. వేడుకల్లో ముస్లిం మత పెద్దలతోపాటు పార్టీల నాయకులు, ఎస్‌ఐ రాఘవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

సాటాపూర్‌ లో బడిబాట

రెంజల్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు మన అంగన్‌వాడి కార్యక్రమంలో భాగంగా బుధవారం సాటాపూర్‌ గ్రామంలో బడిబాట కార్యక్రమంపై అవగాహన ర్యాలీని ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ ప్రమీల జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో పిల్లల తల్లిదండ్రులు, కిశోర బాలికలతో గ్రామంలోని ప్రధాన వీధులగుండా ర్యాలీ నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ 30 నెలలు నిండిన పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో తల్లులతో, కిశోర బాలికలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు భాగ్య, సావిత్రి, ...

Read More »

ఘనంగా రంజాన్‌ వేడుకలు

రెంజల్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పవిత్ర రంజాన్‌ పండుగ వేడుకలను బుధవారం ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రమైన రెంజల్‌ తోపాటు సాటాపూర్‌, నీలా, కందకుర్తి, బొర్గం, తాడ్‌ బిలోలి, వీరన్నగుట్ట తదితర గ్రామాల్లో ముస్లిం సోదరులు ఈద్గాహ్‌లలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు అలింగనం చేసుకొని రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వేడుకల్లో ముస్లిం మత పెద్దలతోపాటు పలు పార్టీల నాయకులు, ఎస్‌ఐ శంకర్‌ పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

ప్రజల సహకారంతోనే పర్యావరణ పరిరక్షణ

జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల సహకారంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. జూన్‌ 5 న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, అటవీ శాఖ, జన విజ్ఞాన వేదిక, ఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ నుండి బస్టాండ్‌ ద్వారా బాల్‌ భవన్‌ వరకు అవగాహన ర్యాలీ ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ ర్యాలీని ప్రారంభించిన అనంతరం బాలభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచీకరణ, నగరీకరణ, జనాభా ...

Read More »

ఘనంగా రంజాన్‌ వేడుకలు

బీర్కూర్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పవిత్ర రంజాన్‌ పండుగ వేడుకలను బుధవారం ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రమైన నసురుల్లాబాద్‌తోపాటు దుర్కి, మిర్జాపూర్‌, మైలారం తదితర గ్రామాల్లో ముస్లిం సోదరులు ఈద్గాహ్‌లలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు అలింగనం చేసుకొని రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వేడుకల్లో ముస్లిం మత పెద్దలతోపాటు పలు పార్టీల నాయకులు, ఎస్‌ఐ సందీప్‌ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.

Read More »