Breaking News

ఇందూరువాసికి బంగారు పతకం

కామారెడ్డి, జూన్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యూఢిల్లీలో బుధవారం ప్రారంభమైన తైక్వాండో మూడవ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో నిజామాబాద్‌ క్రీడాకారులు అసామాన్య ప్రతిభ కనబరిచారు. బ్లాక్‌ బెల్ట్‌ 3వ డాన్‌ బి.హీరాలాల్‌ శిక్షణలో ముగ్గురు కరాటే నేర్చుకుని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు.

ఫూమెసే విభాగంలో జమాల్‌పూర్‌ వైష్ణవ్‌ బంగారు పతకం సాధించగా, ఇదే విభాగంలో చింత ధన్వి, బి.హర్షవర్ధన్‌ రజిత పతకం గెలుపొందారు. తనవద్ద శిక్షణ పొందిన ముగ్గురు అంతర్జాతీయ స్థాయి పోటీలో పతకాలు సాధించడం సంతోషంగా ఉందని కరాటే మాస్టర్‌ హీరాలాల్‌ ఢిల్లీ నుంచి మాట్లాడుతూ అన్నారు.

Check Also

రాజ్యాంగానికి అనుగుణంగా జీవనం సాగించాలి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం లింగంపేట్‌లో జరిగిన సమావేశంలో సర్పంచ్‌కు కాంస్టిట్యూషన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *