Breaking News

ప్యానల్‌ స్పీకర్‌ను కలిసిన నిజాంసాగర్‌ ఎంపిటిసిలు

నిజాంసాగర్‌, జూన్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని ఆయా గ్రామాల తెరాస ఎంపీటీసీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవడంతో అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ హన్మంత్‌ షిండే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించడంతో అభినందనలు తెలిపారు. అనంతరం హన్మంత్‌షిండే మాట్లాడుతూ సిఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివద్ధి సాధ్యమన్నారు.

టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించడంతో గ్రామాల అభివద్ధి పట్టణాలు అభివద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. నిరుపేద ఆడపడుచుల కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో సిడిసి చైర్మన్‌ దుర్గారెడ్డి, ఎంపిటిసి పట్లోళ్ల లక్ష్మి, అచ్చంపేట్‌ చాకలి సుజాత రమేష్‌, తుంకిపల్లి పుప్పాల లచవ్వ, నాయకులు ఎఎంసి వైస్‌ చైర్మన్‌ గైని విట్ఠల్‌, వెల్గనూర్‌ సర్పంచ్‌ రమేష్‌గౌడ్‌, యటకరి నారాయణ, శ్రీకాంత్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *