Breaking News

రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుంది

కామారెడ్డి, జూన్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌ పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్‌ పార్టీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, అసెంబ్లీ పక్ష నేత బట్టి విక్రమార్క తదితరులు అసెంబ్లీ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్‌ నియంత పాలన కొనసాగుతుందని, ప్రతిపక్షం లేకుండా చేయాలని సీఎం కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.

అందులో భాగంగానే కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. ప్రశ్నించే గొంతుకను నొక్కేయడం ప్రజాస్వామ్య విరుద్దమన్నారు. ప్రశ్నించేవారున్నప్పుడే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని, తమ పార్టీ గుర్తుపై గెలిచి సీఎల్పీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని కోరుతున్న అందరిపైన అనర్హత వేటు వేయాలని అన్నారు. టిఆర్‌ఎస్‌ నేతలను కలిసినట్టు పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లు, వీడియో క్లిప్పింగ్‌లను గతంలో స్పీకర్‌కు ఇచ్చినా అనర్హత వేటుపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

Check Also

రాజ్యాంగానికి అనుగుణంగా జీవనం సాగించాలి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం లింగంపేట్‌లో జరిగిన సమావేశంలో సర్పంచ్‌కు కాంస్టిట్యూషన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *