Breaking News

అక్కా చెల్లెళ్ళ అదశ్యం

బీర్కూర్‌, జూన్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని బొమ్మన్‌దేవుపల్లి గ్రామంలో అక్కా చెల్లెళ్ళు అదశ్యమయ్యారని ఎస్‌ఐ సందీప్‌ తెలిపారు. పోలిసుల కథనం ప్రకారం బోమన్‌ దేవ్‌పల్లి గ్రామానికి చెందిన కుర్మా మల్లయ్య, సాయవ్వ దంపతులకు సంధ్యారాణీ, మౌనిక ఇద్దరు కుమార్తెలు. వీరు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో సంధ్య రాణి 9వ తరగతి, మౌనిక 8వ తరగతి చదువుతున్నారు.

తండ్రి మల్లయ్య ఉపాధి కొరకు దుబాయ్‌ వెళ్ళగా ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన ఉదయం తల్లి సాయవ జ్వరంతో పడుకొని వుండగా కూతుళ్ళిద్దరు ఎవరికి చెప్పకుండా ఇంటినుంచి వెళ్లిపోయారని తెలిపారు. బందువులు, స్నేహితుల ఇళ్లల్లో వెదికినా ఆచూకి లభించలేదన్నారు. తల్లి సాయవ్వ ఫిర్యాదు మేరకు నసురుల్లాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Check Also

ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *