Breaking News

పశువులకు గొంతువాపు వ్యాధి నివారణ టీకాలు

ఆర్మూర్‌, జూన్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మగ్గిడి గ్రామంలో శుక్రవారం ఉదయం 6 గంటలకు ఉచిత గొంతువాపు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం ప్రారంభించారు. గ్రామాభివద్ధి కమిటీ గురువారం ఉదయం, సాయంత్రం గ్రామంలో టీకాల కార్యక్రమం గురించి టాం టాం వేయించారు. శుక్రవారం ఉదయం పశువైద్య సిబ్బంది 5 గంటల 45 నిముషాలకే గ్రామానికి చేరుకుని 6 గంటలకు టీకాల కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.

గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో మగ్గిడి గ్రామం ఉండడం వల్ల మేతకు ఎటువంటి ఇబ్బంది లేకపోవడం వల్ల సహజంగానే గ్రామంలో జీవాల పెంపకం గానీ, పాడి పశువుల పెంపకంగానీ మిగతా గ్రామాల కంటే ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఐదు నెలల వయసు పైబడి మూడు సంవత్సరాల వయసు వరకు ఉన్న సుమారు 400 పశువులకు గొంతువాపు వ్యాధి రాకుండా టీకాలు ఇవ్వడం జరిగిందని మండల పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌. లక్కం ప్రభాకర్‌ తెలిపారు.

దుడ్డేలే రాబోవు రోజుల్లో పాడి పశువులై మనకు మంచి పాల ఉత్పత్తిని ఇచ్చి, పాడి రైతులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చుతాయన్నారు. కార్యక్రమంలో గ్రామాభివద్ధి కమిటీ సభ్యులు అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని తమ సిబ్బంది వెంట ఉండి, గల్లీ గల్లీ తిరిగి పెయ్య దూడలను చూపించి, వాటికి టీకాలు తమ సిబ్బంది చేత ఇప్పించిన విధానం అభినందనీయమన్నారు. మగ్గిడి గ్రామాభివద్ధి కమిటీ సభ్యులకు పశుసంవర్ధక శాఖ ద్వారా అభినందనలు తెలిపారు.

కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది రాజేశ్వర్‌, నాగార్జున, ఆర్మూర్‌ మండల గోపాలమిత్రలు సురేష్‌, రాజన్న, సంచార పశువైద్యశాల సిబ్బంది అరుణ్‌ పాల్గొన్నారు. అలాగే శనివారం పిప్రి, మంథని గ్రామాల్లో కొనసాగుతుందని పాడి రైతులు సహకరించాలని కోరారు.

Check Also

రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుంది

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌ పార్టీలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *