Breaking News

ఎన్నికల ప్రక్రియ పరిశీలనకు వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు

నిజామాబాద్‌, జూన్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో మండల పరిషత్‌ అధ్యక్షులు, వైస్‌ చైర్మన్‌, కో ఆప్షన్‌ నెంబర్‌ల ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రగతిభవన్‌లో ఏర్పాటుచేసిన వెబ్‌ కాస్టింగ్‌ జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు పరిశీలించారు. శుక్రవారం ఉదయం ప్రగతి భవన్‌కు వెళ్లి మండల వారీగా జరుగుతున్న కో ఆప్షన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంపీపీ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా జరిగేందుకు వీలుగా జిల్లా కేంద్రంలో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ ఈ సందర్భంగా వెల్లడించారు.

జిల్లాలోని ఇరవై ఏడు మండలాల్లో ఎంపీపీ అధ్యక్షుల వైస్‌ చైర్మన్‌ల, కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలను ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లను చేసినట్లు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ పేర్కొన్నారు. వెబ్‌ కాస్టింగ్‌ పరిశీలనలో జిల్లా కలెక్టర్‌తో పాటు వెబ్‌ కాస్టింగ్‌ నోడల్‌ అధికారులు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఉదయ, ఈ డిస్టిక్‌ మేనేజర్‌ కార్తీక్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

రాజ్యాంగానికి అనుగుణంగా జీవనం సాగించాలి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం లింగంపేట్‌లో జరిగిన సమావేశంలో సర్పంచ్‌కు కాంస్టిట్యూషన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *