Breaking News

Daily Archives: June 11, 2019

సిఎంను కలిసిన కామారెడ్డి జడ్పి చైర్మన్‌ శోభ రాజు

నిజాంసాగర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ శోభ రాజు హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో సిఎం కెసిఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ జిల్లా పరిషత్‌ చైర్మన్‌లు చాలాచోట్ల బిసి రిజర్వేషన్లు రావడంతో మహిళలకు కేటాయించడం జరిగిందన్నారు. జిల్లాలను అభివద్ధి పథంలో నడిపించాలని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు చేరేలా ప్రతి ఒక్కరు చర్యలు చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తదితరులు ...

Read More »

కల్హేర్‌ కో -ఆప్షన్‌ మెంబర్‌కు ఎమ్మెల్యే సన్మానం

నిజాంసాగర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్హేర్‌ మండల కేంద్రలోని టిఆర్‌ఎస్‌ కార్యక్రమంలో నూతన కో-ఆప్షన్‌ మెంబర్‌గా ఎన్నికైన మహమ్మద్‌ ఘానిని ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు. అలాగే కో ఆప్షన్‌ నెంబర్‌ ఘాని భూపాల్‌ రెడ్డిని శాలువాతో పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం భూపాల్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలు చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ నాయకులు, పెద్దలు తదితరులున్నారు.

Read More »

ప్రభుత్వ బడి పిలుస్తోంది

మెరుగుపడుతున్న వసతులు, బోధన ఆదరిస్తే పేదలకు ఎంతో ఉపశమనం రెంజల్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యపు శిథిలాల కింద చిక్కుకున్న జిల్లాలోని సర్కారు బడులు నేడు పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఉపాధ్యాయుల్లో మారిన తీరు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు సమాజంలో వస్తున్న మార్పులతో సర్కార్‌ బడులు మళ్లీ విద్యా సుగంధాలను పంచేలా నిలుస్తున్నాయి. నిష్ణాతులైన ఉపాధ్యాయులు, ఉచిత సదుపాయాలు, బోధనలో మార్పులకు చిహ్నంగా నిలుస్తున్న డిజిటల్‌ తరగతులు, క్రీడలు ఆహ్లాదకరమైన వాతావరణంలో నేడు ...

Read More »

ఉచిత వైద్య శిబిరం

బీర్కూర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలం లోని మిర్జాపూర్‌ గ్రామంలో 12వ తేదీ బుధవారం ఉదయం 9 :00 గంటలకు గ్రూప్‌ అప్‌ హెల్పింగ్‌ ఫ్రెండ్స్‌ మరియు మిర్జాపూర్‌ గ్రామపంచాయతీ వారి ఆధ్వర్యంలో మ్యాక్స్‌ క్యూర్‌ (నిహారిక) హాస్పిటల్‌ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. వైద్య శిబిరంలో జనరల్‌ పిజిషియన్‌ మరియు ఉచిత షుగర్‌ టెస్టు, బి.పి పరీక్షలు, ఉచితంగా మందులు అందించబడుతాయన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని ...

Read More »