Breaking News
అధికారులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

30లోగా ఓటర్ల గణన పూర్తిచేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని నగరపాలక సంస్థ మున్సిపాలిటీలలో బిసి ఓటర్ల గణన సర్వే ఈనెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం తన చాంబర్‌లో రాబోయే ఎన్నికల ఏర్పాట్లపై మున్సిపల్‌ కమిషనర్లతో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. బీసీ ఓటర్ల గణన సర్వే జూలై 4వ తేదీ లోగా పూర్తి చేయాలని ప్రభుత్వము నిర్దేశించిన నందున జిల్లాలో మాత్రం ఈనెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొన్ని గ్రామాలు కలిసినందున గ్రామాలలో కూడా పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాట్లు తదితర చర్యలు తీసుకోవాలని చెప్పారు.

డీలిమిటేషన్‌ ప్రక్రియ చేయాలని ఆదేశించిన పక్షంలో వార్డులు పెరిగే అవకాశమున్నందున అందుకు తగ్గట్టుగా అదనంగా పోలింగ్‌ స్టేషన్లను గుర్తించాలని చెప్పారు. కావలసిన బ్యాలెట్‌ బాక్సులు రిటర్నింగ్‌ అధికారులు పోలీస్‌ సిబ్బంది, డిస్ట్రిబ్యూషన్‌ కౌంటింగ్‌ కేంద్రాల గుర్తింపు తదితర చర్యలు చేపట్టాల్సి ఉన్నందున ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ నాటికి సర్వం సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఎన్నికలు వార్డుల వారీగా జరగనున్నందున ఆ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలను గుర్తించాలని చెప్పారు. సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ జాన్‌ శాంసన్‌, బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌, కమిషనర్‌లు స్వామి, శైలజ, గంగాధర్‌ ఇతరులు పాల్గొన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *