Breaking News
శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

ఆర్థిక గణన పక్కాగా నిర్వహించాలి

నిజామాబాద్‌, జూన్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల ఆర్థిక విషయాలకు సంబంధించి గణన పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. ఏడవ ఆర్థిక గణనకు సంబంధించి సెన్సస్‌ నిర్వహించే సూపర్‌వైజర్లకు ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రాథమిక ఉత్పత్తి విద్యుత్తు సరఫరా త్రాగునీటి సరఫరా నిర్మాణాలు, వ్యాపారాలు సేవలకు సంబంధించిన ప్రజలకు అందుతున్న సేవలు ప్రజల ఆర్థిక అభివద్ధిపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఏడవ ఆర్థిక గణన అన్ని వివరాలతో పక్కాగా సమాచారం సేకరించాలని తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు వాటి ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రజాప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయో తద్వారా ప్రజలకు ఏమేరకు లబ్ధి చేకూరుతుందో వివరాలు సేకరించాలన్నారు.

అదేవిధంగా ప్రభుత్వాలు ప్రజల ఆర్థిక అభివద్ధికి ఇంకా తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచనలు చేయడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. అందువల్ల పూర్తి సమాచారాన్ని ప్రతి ఇంటికి వెళ్లి సేకరించాలని సరైన ప్రణాళికతో వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అప్పుడే ఈ సర్వే లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. మీసేవ కేంద్రాలలో సిటిజన్‌ చార్టర్‌ తప్పకుండా ప్రజలకు తెలిసేలా ప్రదర్శించాలని అందులో చూపిన ప్రకారమే రుసుములు వసూలు చేయాలని ఆయన ఆదేశించారు. వివిధ ధ్రువ పత్రాలకు సేవలకై వచ్చే ప్రజలకు ధ్రువ పత్రాలు జారీకి ఏ పత్రాలు అవసరము వాటినే అడగాలని అనవసరంగా ఇతర పత్రాలు కావాలని దరఖాస్తు దారులను ఒత్తిడి చేస్తే సహించబోమన్నారు.

అదేవిధంగా నిర్దేశించిన రుసుము కంటే అదనంగా వసూలు చేసినట్లు తమ దష్టికి వచ్చినచో తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడం కుదరదని సంబంధితులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అంతేగాక ఉద్దేశించిన సమయంలోనే ఆయా కేంద్రాల్లో ధ్రువపత్రాలు జారీ చేయాలని అధికారులు ఈ విషయమై కేంద్రాలపై పర్యవేక్షణ చేసి ఎక్కడ కూడా ఫిర్యాదుల రాకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి రాములు, ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి రాజేంద్రప్రసాద్‌, సూపర్‌వైజర్లు, మీసేవ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మోకాళ్లపై కూర్చొని నిరసన

కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు గత రెండు నెలల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *