Breaking News
అభినందన సభలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

అభివద్ధిలో భాగస్వాములైనందుకు అభినందనలు

నిజామాబాద్‌, జూన్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐదు సంవత్సరాల పాటు నగర అభివద్ధిలో భాగస్వాములైనందుకు పాలక వర్గాన్ని అభినందిస్తున్నానని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. నగరపాలక సంస్థ ఐదు సంవత్సరాల పాటు పాలకవర్గం కాలపరిమితిని పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో స్థానిక భూమరెడ్డి కన్వెన్షన్‌ హాల్లో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు. నగర మేయర్‌ ఆకుల సుజాత, నగర శాసనసభ్యులు గణేష్‌ గుప్తా, రూరల్‌ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌, శాసనమండలి సభ్యులు ఆకుల లలిత, రాజేశ్వరరావు, విజి గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ నగర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఐదు సంవత్సరాల పాటు అభివద్ధి కార్యక్రమాలతో పాటు స్వచ్ఛభారత్‌, సుందరీకరణ, రహదారుల అభివద్ధి, హరితహారం తదితర కార్యక్రమాలతో పాటు అభివద్ధి చేయడంలో కలిసికట్టుగా ప్రతి ఒక్కరు కషి చేశారని తెలిపారు.

అభివద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములైనందుకు ప్రతి ఒక్కరిని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని ఆయన తెలిపారు. ఇదే స్ఫూర్తితో కొత్తగా వచ్చే పాలకవర్గం కూడా అభివద్ధిపై దష్టి కేంద్రీకరించాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమములో డిప్యూటీ మేయర్‌ ఫయీం, కార్పొరేటర్లు, కమిషనర్‌ జాన్‌ సాంసన్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

మోకాళ్లపై కూర్చొని నిరసన

కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు గత రెండు నెలల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *