Breaking News
అధికారులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

భూముల సర్వే త్వరగా పూర్తి చేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ రెవెన్యూ భూముల విషయంలో సంయుక్త విచారణ జరిపి సమస్యలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. మంగళవారం తన ఛాంబర్లో అటవీ, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు శాఖలకు సంబంధించిన భూముల వివరాలకు సంబంధించి పూర్తిస్థాయి వివరాలను ఇరు శాఖల సంయుక్త విచారణ ద్వారా సమస్యలను పరిష్కరించాలని తెలిపారు అటవీశాఖ హద్దులకు సంబంధించి కూడా అపరిష్కతంగా ఉన్న సమస్యలను పరిశీలించాలన్నారు.

రెవెన్యూ భూములకు సంబంధించి ప్రజలకు పంపిణీ చేసిన భూమికి పాస్‌ పుస్తకాలు అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా అటవీ భూములను ఆక్రమించుకున్న వారి విషయంలో ప్రభుత్వం ఆదేశించిన నియమ నిబంధనలకు అనుగుణంగా చాలా కాలంగా ఆ భూమిని అనుభవిస్తున్న వారి విషయంలో ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని కొత్తగా ఎవరు కూడా భూములను ఆక్రమించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సకాలంలో సంయుక్త విచారణ పూర్తిచేసి అవసరమైన తదుపరి చర్యలకు నివేదికలు అందించాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా అటవీ అధికారి సునీల్‌, సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా రెవిన్యూ అధికారి అంజయ్య, కలెక్టరేట్‌ ఏవో శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *