Breaking News

హరితహారం విజయవంతం చేయాలి

కామారెడ్డి, జూన్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. మంగళవారం ఆయన ఎస్‌పి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ అడవుల నరికివేత, వృక్ష సంపద కాపాడుకోకపోవడం కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, అటవీ సంపదను రక్షించుకోవడంతోపాటు ప్రతి ఒక్కరు మొక్కలు పెంచడాన్ని బాధ్యతగా తీసుకోవాలన్నారు. తద్వారా పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంతోపాటు నీటిని సమకూర్చుకోవచ్చని తెలిపారు. ఆయన వెంట డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌, అధికారులు ఉన్నారు.

Check Also

జనహిత పెండింగ్‌ దరఖాస్తులు పరిస్కరించాలి

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనహితలోని పెండింగ్‌ దరఖాస్తులను అదికారులు వెంటనే పరిశీలించి పరిస్కరించాలని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *