Breaking News

జిల్లాలో ఇసుక లభ్యతపై నివేదిక అందజేయాలి

కామారెడ్డి, జూన్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లాలో ఇసుక లభ్యతపై అధికారులు పూర్తిస్థాయి నివేదికలు సిద్దం చేయాలని కామరెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం ఆయన జిల్లా మైన్స్‌, బూగర్భజలాలు, ఇరిగేషన్‌ శాఖల అదికారులతో సమీక్షించారు. వివిధ అభివృద్ది కార్యక్రమాలకు అవసరమైన ఇసుక జిల్లాలో 46 వేల క్యూబిక్‌ మీటర్లు అందుబాటులో ఉందని తెలిపారు.

దీనికి సంబంధించి అన్ని శాఖలు సంయుక్తంగా చర్యలు చేపట్టి నివేదికలు ఇవ్వాలన్నారు. మాచారెడ్డి మండలం లచ్చాపేట గ్రామంలో అప్పర్‌ మానేర్‌ డ్యాం ప్రదేశంలో లభ్యమయ్యే ఇసుక, ఇతర ప్రదేశాల్లో ఉన్న ఇసుక లభ్యతపై సంబంధిత శాఖలు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇసుకను ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

22న రాష్ట్రస్థాయి గణిత పరీక్ష

కామారెడ్డి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణిత ప్రతిభ పరీక్షల పోస్టర్‌ను కామారెడ్డి జిల్లా జాయింట్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *