లక్ష్యం మేరకు మొక్కలు పెంచాలి

నిజామాబాద్‌, జూన్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లక్ష్యం మేరకు నర్సరీలో మొక్కలు పెంచాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ముప్కాల్‌ మండల కేంద్రంలో డిఆర్‌డిఎ ద్వారా నర్సరీని జిల్లా కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏ మొక్కలు నర్సరీలో పెంచుతున్నారని అడిగి తెలుసుకున్నారు. మండలంలో గ్రామ పంచాయతీకి 40 వేల మొక్కలను పెంచే లక్ష్యానికి అనుగుణంగా నర్సరీలలో సిద్ధం చేయాలని, మొక్కలను నాటిన తర్వాత సంరక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

త్వరలో చేపట్టే హరితహారం కార్యక్రమం సందర్భంగా లక్ష్యం మేరకు మొక్కలు లేనిపక్షంలో సంబంధిత అధికారులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రెండు రోజుల్లో ఎంపీడీవో కార్యాలయాన్ని సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. బాల్కొండ మండలం నుండి ముప్కాల్‌ మండలం ఏర్పాటు చేసినందున పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం నూతన ఎంపీడీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నందున శనివారం కలెక్టర్‌ ముప్కాల్‌ గ్రామపంచాయతీ కార్యాలయ భవనం పై అంతస్తులో ఏర్పాటు చేసే కార్యాలయ గదులను పరిశీలించారు.

జూలై 5 నుండి మండల పరిషత్‌ అధ్యక్షుల పదవి బాధ్యతలు స్వీకరించవలసి ఉన్నందున ఆ లోపే సిబ్బంది ఫర్నిచర్‌, గదుల ఇన్నోవేషన్‌ పనులను చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎంపీడీవోను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ వెంట ఆర్మూర్‌ ఆర్‌డిఓ తదితరులు ఉన్నారు.

Check Also

సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండల కేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *