సోమవారం కల్లా వార్డుల పునర్విభజన పూర్తి చేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపాలిటీలలో వార్డుల పునర్విభజన సోమవారం వరకు పూర్తి చేయాలని కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన నగర పాలక సంస్థ కార్యాలయంలో పర్యటించి ఓటర్ల జాబితా సిద్ధం చేయడం, పునర్విభజన కార్యక్రమాలకు సంబంధించి పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వార్డుల పునర్విభజన ప్రచురణ కార్యక్రమానికి సంబంధించి మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు.

ఈ ఆదేశాల ప్రకారం మున్సిపాలిటీలలో జులై 1వ తేదీ వరకు వార్డుల పునర్విభజనకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అందుకు సంబంధించి అభ్యంతరాలు స్వీకరించాలని, జులై 6వ తేదీన అభ్యంతరాలను పరిశీలించి కౌన్సిల్లో తీర్మానాన్ని చేయాలని, 7వ తేదీన వార్డుల పునర్విభజనకు సంబంధించి చివరి జాబితా ప్రచురించాలని అధికారులను ఆదేశించారు.

ఓటర్ల జాబితా కనుగుణంగా మున్సిపాలిటీలలో విలీనం చేసిన గ్రామాలను పరిగణనలోకి తీసుకొని వార్డులను పునర్విభజన చేయాలని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి ఇతర కార్యక్రమాలను చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేయుటకు ఏ సమయంలో ఏ కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు మున్సిపల్‌ పరిపాలన శాఖ కమిషనర్‌, సంచాలకులు ఆదేశాలకనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీలో జరుగుతున్న కార్యక్రమాలపై పర్యవేక్షణ చేయాలని అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని సూచించారు. అన్ని కార్యక్రమాలు కూడా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని పేర్కొన్నారు. నిర్ణయించిన తేదీలలో కచ్చితంగా సంబంధిత పనులు పూర్తి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా పట్టణాల మ్యాపులను పరిశీలించారు. కలెక్టర్‌ వెంట మున్సిపల్‌ అధికారులు ఆనంద్‌ సాగర్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌ డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం 60 మంది ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *