Breaking News

Daily Archives: July 1, 2019

జిల్లా కలెక్టర్‌కు కాంగ్రెస్‌ నేతల వినతి

కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం కొరకు స్థలాన్ని కేటాయించాలని జిల్లా కలెక్టర్‌కు సోమవారం డిసిసి అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ రావు వినతి పత్రం ఇచ్చారు. వివిధ పార్టీ కార్యాలయాల కొరకు ఎలాగైతే ఒక ఎకరం భూమిని కేటాయించారో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి కూడా అలాగే భూమిని కేటాయించాలని, ఇతర పార్టీలకు ఏదైతే ధర నిర్ణయించారో అదే ధర కాంగ్రెస్‌ పార్టీ కూడా చెల్లించి తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో చాట్ల రాజేశ్వర్‌, ...

Read More »

జల శక్తి అభియాన్‌కు కార్యాచరణ ప్రణాళిక తయారు చేయండి

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జల శక్తి అభియాన్‌ కార్యక్రమం ద్వారా జిల్లాలో నీటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం తన చాంబర్లో జలశక్తి అభియాన్‌ కార్యక్రమంపై ఇప్పటికే కొనసాగుతున్న కార్యక్రమాలు, తదుపరి తీసుకోవాల్సిన కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో కార్యక్రమంపై ఇప్పటికే చేపట్టిన వర్షపు నీటినీ పొదుపు చేయడం, వాటర్‌ షెడ్ల, ఫాం పాండ్స్‌, పర్కులేషన్‌ ...

Read More »

రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత టిఆర్‌ఎస్‌దే

నిజాంసాగర్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత టిఆర్‌ఎస్‌దే అని అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ హన్మంత్‌ షిండే అన్నారు. నిజాంసాగర్‌ మండలం మహమ్మద్‌నగర్‌ గ్రామంలో రూ. 50 లక్షలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘభవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమన్నారు. రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత టిఆర్‌ఎస్‌దేనన్నారు. గత ప్రభుత్వాలు రైతులకు కరెంటు లేక నానా ఇబ్బందులు పడేవారని, కానీ ...

Read More »

పిఆర్‌టియు మండల కార్యవర్గం ఎన్నిక

బీర్కూర్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనంతరం పిఆర్‌టియు మండల నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. మండల అధ్యక్షులుగా హనుమాండ్లు, ప్రధాన కార్యదర్శిగా భూషన్‌, కార్యవర్గ సభ్యులుగా సంజీవులు, శ్రీచంద్‌, సుజాతలను ఎన్నుకున్నారు.

Read More »

నసురులాబాద్‌ మండల సర్వసభ్య సమావేశం

బీర్కూర్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిఆర్‌టియు నసురుల్లాబాద్‌ మండల సర్వసభ్య సమావేశం సోమవారం నసురుల్లాబాద్‌ ఉన్నత పాఠశాలలో జరిగింది. మండల అధ్యక్షులు కొప్పిశెట్టీ శ్రీనివాస్‌ అధ్యక్షతన సమావేశమయ్యారు. సమావేశంలో జిల్లా ఆధ్యక్షులు దామోదర్‌ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో పిఆర్‌టియు ముందుంటుందని, హక్కులే కాకుండా విధులు నిర్వర్తించేలా చేసే సంఘం పిఆర్‌టియు అని, సిపిఎస్‌ రద్దు అయ్యేంతవరకు పోరాటాలు చేస్తామని, ఐఆర్‌, పిఆర్‌సి ఇప్పిస్తామని అన్నారు. దత్తత పాఠశాలల ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామన్నారు. ఈ ...

Read More »

ఆరోగ్యకర సమాజం కోసం వైద్యులు

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇందూర్‌ ఆద్వర్యంలో సోమవారం డాక్టర్స్‌ డే నిర్వహించారు. నిజామాబాదు నగరంలోని సందీప్‌ గార్డెన్స్‌లో జరిగిన కార్యక్రమంలో వైద్యులు డిఎల్‌ఎన్‌ స్వామి, కష్ణమూర్తి పవార్‌, బొద్దుల రాజేంద్రప్రసాద్‌, ఇందూరు ప్రవీణ్‌, అంకం గణేష్‌, కొండ సంతోష్‌, భగవతి ప్రవీణ్‌, భానుప్రియలను సన్మానించారు. జులై ఒకటిన చార్టెడ్‌ అకౌంటెంట్స్‌డే కూడా కావడంతో సిఎ దీకొండ యాదగిరిని సత్కరించారు. ఈ సందర్భంగా లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు లక్ష్మినారాయణ భరద్వాజ్‌ మాట్లాడుతూ ఆరోగ్యకర సమాజం ...

Read More »

మండల ఉపసర్పంచ్‌ల ఫోరం ఎన్నిక

రెంజల్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల ఉపసర్పంచ్‌ల ఫోరం మండల కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడుగా మరా నాగభూషన్‌ (నీలా), ఉపాధ్యక్షుడిగా ఈదర జగదీష్‌, ప్రధానకార్యదర్శిగా పీర్‌ సింగ్‌, కోశాధికారిగా వీరేందర్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ మండల ఉపసర్పంచ్‌లు తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఉపసర్పంచ్‌ల అభివద్ధికి కషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో సభ్యులు జలయ్య, కుర్మె సాయిలు, ప్రవీణ్‌, ఫెరోజ్‌ బేగ్‌, రవి, మొగులయ్య, ముసా ...

Read More »