Breaking News

ఆరోగ్యకర సమాజం కోసం వైద్యులు

నిజామాబాద్‌, జూలై 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇందూర్‌ ఆద్వర్యంలో సోమవారం డాక్టర్స్‌ డే నిర్వహించారు. నిజామాబాదు నగరంలోని సందీప్‌ గార్డెన్స్‌లో జరిగిన కార్యక్రమంలో వైద్యులు డిఎల్‌ఎన్‌ స్వామి, కష్ణమూర్తి పవార్‌, బొద్దుల రాజేంద్రప్రసాద్‌, ఇందూరు ప్రవీణ్‌, అంకం గణేష్‌, కొండ సంతోష్‌, భగవతి ప్రవీణ్‌, భానుప్రియలను సన్మానించారు. జులై ఒకటిన చార్టెడ్‌ అకౌంటెంట్స్‌డే కూడా కావడంతో సిఎ దీకొండ యాదగిరిని సత్కరించారు.

ఈ సందర్భంగా లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు లక్ష్మినారాయణ భరద్వాజ్‌ మాట్లాడుతూ ఆరోగ్యకర సమాజం కోసం వైద్యులు చేస్తున్న కషి అభినందనీయమన్నారు. వైద్యులు లేని సమాజాన్ని ఊహించలేమన్నారు. వైద్య వత్తి ఎంతో పవిత్రమైనదని పేర్కొన్నారు. లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిభిరాలలో వైద్యులు ఉచితంగా సేవలందిస్తున్నారని గుర్తు చేశారు.

కార్యక్రమంలో లయన్స్‌ జిల్లా పిఆర్వో పి.లక్ష్మినారాయణ, ఇందూరు క్లబ్‌ కార్యదర్శి చింతల గంగాదాస్‌, కోశాధికారి సిలివేరి గణేష్‌, పూర్వాద్యక్షులు జి.కష్ణారెడ్డి, పుల్గం హన్మాండ్లు, ప్రోగ్రాం చైర్మెన్‌ ఇరుమల శివలింగం, ప్రతినిధులు మీసాల ప్రభాకర్‌, పొలాస సత్యనారాయణ, బోజన్న, దాసరి రాఘవేందర్‌, బంటు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Check Also

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

రెంజల్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రానికి చెందిన నరేష్‌ అనారోగ్యానికి గురి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *