Breaking News

జల శక్తి అభియాన్‌కు కార్యాచరణ ప్రణాళిక తయారు చేయండి

నిజామాబాద్‌, జూలై 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జల శక్తి అభియాన్‌ కార్యక్రమం ద్వారా జిల్లాలో నీటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం తన చాంబర్లో జలశక్తి అభియాన్‌ కార్యక్రమంపై ఇప్పటికే కొనసాగుతున్న కార్యక్రమాలు, తదుపరి తీసుకోవాల్సిన కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో కార్యక్రమంపై ఇప్పటికే చేపట్టిన వర్షపు నీటినీ పొదుపు చేయడం, వాటర్‌ షెడ్ల, ఫాం పాండ్స్‌, పర్కులేషన్‌ ట్యాంక్‌ల నిర్మాణాలపై వివరాలను సిద్ధం చేయాలన్నారు.

ఇప్పటికే చేపట్టిన వీటి నిర్మాణం, ఇక ముందు చేపట్ట వలసిన వాటిపై ప్రణాళికలు తయారు చేయాలన్నారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి రాష్ట్రస్థాయిలో సంయుక్త కార్యదర్శి, ఉపకార్యదర్శి, కన్సల్టెంట్లను నియమించారని వీరి పర్యవేక్షణలో ఆయా జిల్లాలలో చేపట్టే కార్యక్రమాల ప్రతిపాదనలను వారు పర్యటించి అవసరమైన వివరాలను ఆమోదించి సంబంధిత పోర్టల్‌లో వాటిని అప్‌లోడ్‌ చేస్తారన్నారు. జిల్లాలో ఇప్పటికే మంజూరు చేసిన పనులలో కొనసాగుతున్న ఫాంపాండ్స్‌ను పూర్తిచేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. జల శక్తి అభియాన్‌ కింద జిల్లాలోని ఆర్మూర్‌, మోర్తాడ్‌, ముప్కాల్‌, నిజామాబాద్‌, వేల్పూర్‌ మండలాలను బ్లాకులుగా గుర్తించడం జరిగిందని తెలిపారు.

కార్యక్రమములో గ్రామాలను, ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేసి ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టటానికి భూగర్భ జలాలు పైకి రావడానికి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలని, భవిష్యత్‌ తరాలకు నీటి సమస్య రాకుండా, నీటి విలువపై శ్రద్ధ కనబర్చేలా చూడాలని తెలిపారు. సమావేశంలో జిల్లా అటవీ అధికారి సునీల్‌, డిఆర్‌డివో రమేష్‌ రాథోడ్‌, గ్రౌండ్‌ వాటర్‌ డిడి ప్రసాద్‌, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, జిల్లా ఇన్‌చార్జి పంచాయతీ అధికారి కష్ణమూర్తి, జిల్లా నీటిపారుదల అధికారులు రాధాకష్ణ, నెహ్రు యువ కేంద్ర ప్రతినిధి రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

రాజ్యాంగానికి అనుగుణంగా జీవనం సాగించాలి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం లింగంపేట్‌లో జరిగిన సమావేశంలో సర్పంచ్‌కు కాంస్టిట్యూషన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *