Breaking News

నీటి సంరక్షణపై విస్తత అవగాహన

నిజామాబాద్‌, జూలై 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టటానికి ప్రజల్లో విస్తత అవగాహన కల్పించాలని కేంద్ర హౌసింగ్‌ పట్టణాభివద్ధి శాఖ కార్యదర్శి దుర్గా శంకర్‌ మిశ్రా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలను, కలెక్టర్లను కోరారు. మంగళవారం ఢిల్లీ నుండి ఆయన జలశక్తి అభియాన్‌ కార్యక్రమం గురించి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పలు సూచనలు చేశారు. కార్యక్రమాన్ని రెండు విడతలుగా నిర్వహించనున్నామని తెలిపారు. కార్యక్రమం మొత్తం ముఖ్య ఉద్దేశం నీటిని సంరక్షించడం అని స్పష్టం చేశారు.

ఇందుకుగాను ప్రతి ప్రభుత్వ భవనం, ప్రజల ఆవాసాలు, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలు అన్ని చోట్ల వర్షపు నీటిని ఒడిసి పట్టి నీటిని వధా కాకుండా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇందుకుగాను ప్రజలను, సంస్థలను, విద్యార్థులను, భాగస్వాములను చేయాలన్నారు. నీటి ప్రయోజనాలను దాని ముఖ్య ఉద్దేశ్యాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి అన్ని విభాగాలలో, అన్ని ప్రాంతాలలో విస్తతంగా అందుబాటులో ఉన్న అన్ని మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించాలని, ప్రజలందరికీ నీటి ప్రాధాన్యంపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు.

ఇందుకుగాను విద్యార్థులకు వ్యాసరచన, పాటలు, మ్యూజిక్‌ తదితర పోటీలు నిర్వహించాలని తెలిపారు. నాటకాలు, డప్పు, పాటలు ఇతర మాధ్యమాల ద్వారా విస్తత ప్రచారం చేయాలన్నారు. ఈ విషయమై వేరు వేరు విభాగాలకు చెందిన ప్రజలతో సమావేశాలు ఏర్పాటుచేసి నీటి ప్రాధాన్యతపై తెలియజేయాలన్నారు. అంతేకాక వధా నీటిని హార్టికల్చర్‌, అగ్రికల్చర్‌, నిర్మాణ పనులకు తిరిగి ఉపయోగించుటకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు అవసరమైన కార్యక్రమాలు రూపొందించుకోవాలన్నారు. అన్ని ప్రాంతాలలో ఇందుకుగాను కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

స్థానిక సంస్థలు క్లబ్బులు స్థానిక గహ సంఘాలు విద్యాసంస్థలు ఈ కార్యక్రమం నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు కురవడానికి ముఖ్య కారణమైన మొక్కలను పెద్ద సంఖ్యలో నాటించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్సులో మున్సిపల్‌ కమిషనర్‌ జాన్‌ సామ్సన్‌, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ మధుసూదన్‌ రెడ్డి, మెప్మా పిడి రాములు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జనహిత పెండింగ్‌ దరఖాస్తులు పరిస్కరించాలి

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనహితలోని పెండింగ్‌ దరఖాస్తులను అదికారులు వెంటనే పరిశీలించి పరిస్కరించాలని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *