Breaking News

Daily Archives: July 3, 2019

మహిళలపై వేధింపులను అరికట్టేందుకె సఖీ, షీటీమ్‌

రెంజల్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను, వేధింపులను, వరకట్నం, ఈవ్‌ టీజింగ్‌లను అరికట్టడంతో పాటు భార్యాభర్తల మధ్య వచ్చే తగాదాలను షీటీం పరిష్కరిస్తుందని తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌ అన్నారు. బుధవారం మండల ప్రజాపరిషత్‌ కార్యక్రమంలో ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో మహిళలకు రక్షణ కవచంలా సఖీ షీటీమ్‌ పనిచేస్తుందని, గ్రామాల్లో బాల్యవివాహాలు చేస్తున్నట్లు సమాచారం తెలిసిన వారు నేరుగా పోలీసులను సంప్రదించాలన్నారు. బాలికల విషయంలో ఈవ్‌టీజింగ్‌ ...

Read More »

5న తొలి జడ్పి సమావేశం

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పరిషత్‌ మొదటి సమావేశాన్ని ఈనెల 5వ తేదీ శుక్రవారం కామారెడ్డి మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత మండల పరిషత్‌ కార్యాలయాన్ని జిల్లా పరిషత్‌ కార్యాలయంగా మార్చినట్టు పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన జడ్పిటిసి, కో ఆప్షన్‌ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంతో పాటు సమావేశం జరుగుతుందని, జిల్లా ప్రజాపరిషత్‌ లైజనింగ్‌ అధికారి జి.సాయన్న పేర్కొన్నారు.

Read More »

ఉరివేసుకొని యువకుని ఆత్మహత్య

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణం ముదాంగల్లికి చెందిన సరీన్‌ కుమార్‌ (32) అనే యువకుడు బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిఎంపి వైద్యునిగా పనిచేస్తున్న ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు చెప్పారు. మృతుని భార్య స్రవంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ గోవింద్‌ పేర్కొన్నారు.

Read More »

పార్టీ సభ్యత్వ లక్ష్యాన్ని చేరుకోవాలి

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లాలోని తెరాస పార్టీ శ్రేణులు పార్టీ సభ్యత్వ లక్ష్యాన్ని అధిగమించాలని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌, ఎమ్మెల్సీ వి.జి.గౌడ్‌ అన్నారు. బుధవారం కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ సభ్యత్వాన్ని విజయవంతంగా పూర్తిచేసి పార్టీ బలోపేతానికి ప్రతికార్యకర్త కృషి చేయాలన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, కార్యకర్తలకు ఇస్తున్న భరోసా గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. ...

Read More »

చేపల పెంపకంపై అవగాహన సదస్సు

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో బుధవారం ఫిష్‌ కార్పొరేషన్‌ ఫెడరేషన్‌ న్యూఢిల్లీవారి ఆర్థిక సాయంతో కామారెడ్డి మత్స్యశాఖ ఆద్వర్యంలో మత్స్యకారులకు చేపల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మత్స్యకారులకు ఎన్‌ఎఫ్‌డిబి, రాష్ట్ర ప్రభుత్వం, మత్స్యశాఖ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న పథకాల గురించి వివరించారు. చెరువుల యాజమాన్య పద్దతులు, చేపలకు వచ్చే వ్యాధులు – నివారణ, చేపల పెట్టుబడి – మార్కెటింగ్‌, మత్స్యకారులకు ఇన్సురెన్సు పథకం, ఎక్స్‌గ్రేషియా గురించి వివరించారు. కార్యక్రమంలో డిఎఫ్‌వో పూర్ణిమ, డిఎఫ్‌సిఎస్‌ ...

Read More »

హరితహారంలో 2.88 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అందరి భాగస్వామ్యంతో ఈయేడు కామారెడ్డి జిల్లాకు హరితహారంలో నిర్దేశించుకున్న 2 కోట్ల 88 లక్షల మొక్కలు నాటడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన సదాశివనగర్‌ మండలం వడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులే కాకుండా పాఠశాల, కళాశాలల విద్యార్తులు, స్వచ్చంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, ప్రజలను హరితహారంలో భాగస్వాములను చేయాలని సూచించారు. గత సంవత్సరం 1.32 కోట్ల మొక్కలు ...

Read More »

పదవి విరమణ సందర్భంగా ఎంపిటిసికి సన్మానం

నిజాంసాగర్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని సింగీతం గ్రామంలో ఎంపీటీసీ పదవి విరమణ సందర్భంగా పిఆర్‌టియు ఆధ్వర్యంలో శైలజ నారాయణలకు పిఆర్‌టియు మండల అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్‌ పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీటీసి మాట్లాడుతూ గ్రామంలో ఎన్నో రకాల అభివద్ధి పనులు చేశామన్నారు. కార్యక్రమంలో అమర్‌ సింగ్‌, సంతోష్‌, రమణ టీచర్లు తదితరులు ఉన్నారు.

Read More »

నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్‌

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు చార్జ్‌ తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా చార్జ్‌ తీసుకుంటూ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం కమిషనర్‌, సంబంధిత విభాగాల అధికారులు, సిబ్బందితో పరిచయం తర్వాత కొనసాగుతున్న పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభమైనందున పారిశుద్ధ్య కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని, చెత్తను తొలగించాలని, వర్షపు నీరు ...

Read More »

ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలి

బాన్సువాడ, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల సంక్షేమం కోసం పాటుపడేవారే ప్రజా నాయకులు అవుతారని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ది పథకాల గురించి వివరించారు. సర్పంచ్‌ మొదలుకొని శాసనసభ్యుని వరకు ప్రజా సంక్షేమం ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. సంక్షేమం, అభివృద్ది పథకాలతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం తాగు, సాగునీటి రంగాలకు పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. మిషన్‌ ...

Read More »

నర్సరీ పరిశీలన

నిజాంసాగర్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొక్కల సంరక్షణ పకడ్బందీగా నిర్వహించాలని ఏపీవో సుదర్శన్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండలం హాసన్‌ పల్లి గ్రామంలో నర్సరీని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మొక్కల సంరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు 6 మొక్కలు నాటి వాటి సంరక్షణ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. మొక్కలు పెంచడం వల్ల మనకు ఎన్నో లాభాలున్నాయని వాటి ద్వారా స్వచ్చమైన గాలి అందుతుందన్నారు. మొక్కలు పెంచడం వల్ల ఎన్నో లాభాలున్నాయన్నారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి రవికుమార్‌ రాథోడ్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ...

Read More »

మహిళ అదృశ్యం

బీర్కూర్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో ఓ మహిళ తన పిల్లలతో కలిసి గత మూడు రోజులుగా కనబడటం లేదని ఎస్‌ఐ సందీప్‌ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం నసురుల్లాబాద్‌ గ్రామానికి చెందిన చాకలి సవిత జూలై 1వ తేది సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు కూలి పనులకు వెళ్లిన తరువాత తన 15 నెలల కూతురు, 5 సంవత్సరాల కొడుకుతో కలిసి ఇంటికి తాళం వేసి, తమ కుటుంబ సబ్యులు వస్తే తాళం ఇవ్వవలసిందిగా ...

Read More »

15లోగా రెగ్యులేటరీ పనులు పూర్తిచేయాలి

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్‌ఆర్‌ఎస్‌పి పునర్జీవ పథకం ద్వార ముప్కాల్‌ వద్ద చేపట్టే మూడవ పంపింగ్‌ రెగ్యులేటరీ పనులను ఈనెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని అందుకు అవసరమైన గేట్లను ముందస్తుగానే సిద్ధం చేయాలని రాష్ట్రరోడ్లు భవనాలు రవాణా శాసనసభ వ్యవహారాలు గహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. వరద కాలువ జీరో పాయింట్‌ వద్ద 420 కోట్ల అంచనా వ్యయంతో ఎస్‌ఆర్‌ఎస్‌పి పునర్జీవ ప్రాజెక్టులో భాగంగా మూడవ పంపింగ్‌ పనులను ...

Read More »