Breaking News

15లోగా రెగ్యులేటరీ పనులు పూర్తిచేయాలి

నిజామాబాద్‌, జూలై 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్‌ఆర్‌ఎస్‌పి పునర్జీవ పథకం ద్వార ముప్కాల్‌ వద్ద చేపట్టే మూడవ పంపింగ్‌ రెగ్యులేటరీ పనులను ఈనెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని అందుకు అవసరమైన గేట్లను ముందస్తుగానే సిద్ధం చేయాలని రాష్ట్రరోడ్లు భవనాలు రవాణా శాసనసభ వ్యవహారాలు గహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. వరద కాలువ జీరో పాయింట్‌ వద్ద 420 కోట్ల అంచనా వ్యయంతో ఎస్‌ఆర్‌ఎస్‌పి పునర్జీవ ప్రాజెక్టులో భాగంగా మూడవ పంపింగ్‌ పనులను మంత్రి బుధవారం పరిశీలించిన అనంతరం ఇంజనీరింగ్‌ అధికారులతో పనులను సమీక్షించారు.

జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం రాంపూర్‌, మెట్‌పల్లి మండలంలోని రాజేశ్వరరావు పేటలో రెండు పంపింగ్‌ పనులు పూరై ట్రయల్‌ రన్‌ పూర్తి అయిన దష్ట్యా అక్కడి నుండే నేరుగా ప్రాజెక్టులోకి నీటి ప్రవాహము వెళ్లే అవకాశమున్నందున మూడవ పంపింగ్‌లో భాగంగా చేపట్టే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. అట్టి పనులు 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైన గేట్లను సంబంధిత కంపెనీల నుండి తెప్పించి ఫిట్టింగ్‌ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు రివర్స్‌ పంపింగ్‌ ద్వారా విడుదల చేసే పక్రియ ఈనెల 20 తర్వాత చేపట్టనున్నట్లు చెప్పారు.

పంపింగ్‌ ప్రక్రియలో భాగంగా మోటార్‌ ఫిట్టింగ్‌ విద్యుత్‌ కనెక్షన్‌ పనులను అక్టోబర్‌ చివరి వరకు పూర్తి చేయాలని, అందుకు ప్రణాళికను ముందస్తుగా తయారుచేసుకొని పనుల వేగవంతానికి కషి చేయాలని అధికారులను ఆదేశించారు. వరద కాలువ 365 రోజుల పాటు నిండు కుండలా ఉండే అవకాశమున్న దష్ట్యా బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని చెరువులు, కుంటలను నింపేందుకు అవసరమైన తూములను ఏర్పాటు చేయాలని అందుకు ఇంజనీరింగ్‌ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు సంయుక్తంగా పరిశీలన చేసి ఏ చెరువు ఎక్కడ నుండి నింపవచ్చునో పరిశీలన చేసి ప్రతిపాదనలు తయారు చేయాలని గతంలో నిర్ణయం తీసుకున్నట్లు తద్వారా నిధుల మంజూరుకు అవసరమైన ప్రతిపాదనలు అందజేయాలని అధికారులను ఆదేశించారు.

ఒకవేళ అటు ప్రతిపాదనలు ప్రభుత్వ స్థాయిలో పెండింగ్‌ ఉన్న పక్షంలో తెలియజేయాలని చెప్పారు. గతంలో 15 తూముల ఏర్పాటుకు నిర్ణయించినందున రైతుల ప్రయోజనార్థం మరిన్ని తూముల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరద కాలువను 100 కి.మీ.లకు ఒక ఇంజనీరింగ్‌ అధికారులు కేటాయింపు కాకుండా ప్రతి 25 కిలోమీటర్లకు ఒక్కరు చొప్పున ఉంచాలని సిఈని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు, సిఈ సుధాకర్‌ రెడ్డి, ఎస్‌సి శ్రీకాంత్‌, ఈఈ సుధాకిరణ్‌, ఆర్‌డిఓ శ్రీనివాసులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జ్వరాలు రాకుండా ముందే నివారణ చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జ్వరాలతో వచ్చిన ప్రజలకు అవసరమైన చికిత్సలు అందించడంతోపాటు జ్వరాలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *