Breaking News

హరితహారంలో 2.88 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం

కామారెడ్డి, జూలై 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అందరి భాగస్వామ్యంతో ఈయేడు కామారెడ్డి జిల్లాకు హరితహారంలో నిర్దేశించుకున్న 2 కోట్ల 88 లక్షల మొక్కలు నాటడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన సదాశివనగర్‌ మండలం వడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులే కాకుండా పాఠశాల, కళాశాలల విద్యార్తులు, స్వచ్చంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, ప్రజలను హరితహారంలో భాగస్వాములను చేయాలని సూచించారు.

గత సంవత్సరం 1.32 కోట్ల మొక్కలు లక్ష్యం కాగా ఈయేడు 2.88 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, ప్రతి మండలానికో ప్రత్యేకాధికారిని ఇందుకోసం నియమించినట్టు తెలిపారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం 2018 ప్రకారం ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటుతోపాటు 40 వేల మొక్కల పెంపకం చేపట్టడం, సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శిని బాద్యులను చేయడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ జానకి, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, ఎంపిడివో అశోక్‌కుమార్‌, పంచాయతీ కార్యదర్శి చంద్రకళ, ప్రధానోపాధ్యాయుడు అశోక్‌కుమార్‌, తదితరులున్నారు.

Check Also

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

రెంజల్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రానికి చెందిన నరేష్‌ అనారోగ్యానికి గురి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *