Breaking News

Daily Archives: July 4, 2019

ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం

బీర్కూర్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మే మాసంలో 6, 10, 14 తేదీలలో మూడు విడతలుగా నిర్వహించిన ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీటీసీలకు, జడ్పిటిసిలకు, ఎంపీపీలకు గురువారం బాన్సువాడ, బీర్కూర్‌, నసురుల్లాబాద్‌, కోటగిరి, రుద్రూర్‌, వర్ని, చందూరు, మోస్రా తదితర మండలాలలో నూతన ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర శాసనసభ పతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో 578 స్థానాలలో నూతనంగా ప్రమాణ స్వీకారాన్ని పలు మండలాలలో చేస్తున్నారని ...

Read More »

అదశ్యమైన మహిళ ఆచూకీ లభ్యం

బీర్కూర్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత మూడు రోజులుగా తన పిల్లలతో సహా కనిపించకుండా పోయిన నసురుల్లాబాద్‌ గ్రామానికి చెందిన చాకలి సవిత ఆచూకీ కనుగొన్నట్లు ఎస్‌ఐ సందీప్‌ తెలిపారు. సవిత ఉపయోగిస్తున్న ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా హైద్రాబాద్‌లో వున్నట్లు తెలుసుకొని పొలీస్‌ సిబ్బందిని పంపించి సదరు మహిళను నసురుల్లాబాద్‌ తీసుకు వచ్చామని అన్నారు. బార్య, భర్తల మధ్య తరుచు గొడవలు జరుగుతుందటంతో మనస్తాపం చెంది పిల్లలతో వెళ్ళిపోయిందని వివరించారు. సదరు మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు.

Read More »

కలెక్టర్‌ను కలిసిన కేంద్ర అండర్‌ సెక్రటరీలు

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వానికి చెందిన అండర్‌ సెక్రటరీలు జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావును కలిశారు. గురువారం వారు ఎంసిఆర్‌ఆర్‌హెచ్‌ఆర్‌డి జిల్లా సమన్వయకర్త ఆంజనేయులుతో కలిసి కలెక్టర్‌ చాంబర్‌లో కలెక్టర్‌ను కలుసుకున్నవారిలో డోలి సెహగల్‌, అపర్ణ, సతీ మధుసూదన్‌, ఉషా శ్రీనివాసన్‌, సునీత సజ్వాన్‌, వాసంతి లఖుమ్నా, నాగేశ్వరరావు, కమలేష్‌ కుమార్‌లు ఉన్నారు. వీరు జాతీయ హెల్త్‌ మిషన్‌, బేటి ...

Read More »

శుక్రవారం మంత్రి పర్యటన

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణ, శాసన సభ వ్యవహారాల మరియు గహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు కామారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ప్రమాణ పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి బాధ్యతల, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. అలాగే మధ్యాహ్నం 3.00 గంటలకు సారంగాపూర్‌ వద్ద నిర్మిస్తున్న ప్యాకేజ్‌ 20 ...

Read More »

ఎంపీపీకి ప్రధాని చిత్రపటాన్ని బహుకరించిన యెండల

రెంజల్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన లోలపు రజిని కిషోర్‌లను గురువారం నిజామాబాద్‌ మాజీ శాసనసభ్యుడు యెండల లక్ష్మీనారాయణ, బిజెపి రాష్ట్ర నాయకులు బస్వలక్ష్మి నర్సయ్య, ప్రధానమంత్రి మోడీ చిత్రపటాన్ని అందజేసి సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ. రెంజల్‌ మండలంలో బీజేపీ పార్టీ మొదటిసారిగా ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుని బీజేపీకి తిరుగులేదని నిరూపించిన కార్యకర్తల, నాయకుల కషి ఎనలేనిదని కొనియాడారు. అందరికీ అందుబాటులో ఉండి కషి చేయాలని ఎంపీపీని కోరారు. ...

Read More »

మున్సిపల్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోండి

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : త్వరలో నిర్వహించబోయే మున్సిపల్‌ ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హైదరాబాద్‌ నుండి జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో మాట్లాడారు. ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. ఓటర్ల జాబితా సిద్ధం చేసుకోవడం వార్డులో పునర్విభజన అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం వాటి ఫైనల్‌ పబ్లికేషన్‌ చేయాలన్నారు. పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి వాటి పరిస్థితిని ...

Read More »

రెంజల్‌ ఎంపీపీగా లోలపు రజినీ

రెంజల్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల ఎంపీపీగా లోలపు రజినీ కిషోర్‌ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఎంపీడీవో శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మండల ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ రాజేందర్‌ ఎంపీపీ లోలపు రజిని కిషోర్‌తో పాటు, వైస్‌ ఎంపిపి యోగేష్‌, మండల కో ఆప్షన్‌ సభ్యుడు అంతయ్య, ఎంపీటీసీ సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎంపీపీగా రజినీ కిషోర్‌ బాధ్యతలు స్వీకరించారు. ఎంపీపీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, ...

Read More »

దూపల్లిలో సైన్స్‌ అవగాహన సదస్సు

రెంజల్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దూపల్లి ప్రాథమిక పాఠశాలలోని 4 మరియు 5వ తరగతి విద్యార్థులకు గురువారం అగస్త్య ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సైన్స్‌ అవగాహన సదస్సు నిర్వహించారు. పిల్లలకు సైన్స్‌ పట్ల అవగాహనను కల్పించాలనే ఉద్ధేశ్యంతో వర్కింగ్‌ మోడల్స్‌ పద్దతి ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సాయరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు దేవిదాస్‌, పిఆర్‌టియు అధ్యక్ష కార్యదర్శులు సోమలింగం, సాయరెడ్డి, అగస్త్య ఫౌండేషన్‌ సభ్యులు శివకుమార్‌, రవీందర్‌, మొహిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »