Breaking News

కలెక్టర్‌ను కలిసిన కేంద్ర అండర్‌ సెక్రటరీలు

నిజామాబాద్‌, జూలై 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వానికి చెందిన అండర్‌ సెక్రటరీలు జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావును కలిశారు. గురువారం వారు ఎంసిఆర్‌ఆర్‌హెచ్‌ఆర్‌డి జిల్లా సమన్వయకర్త ఆంజనేయులుతో కలిసి కలెక్టర్‌ చాంబర్‌లో కలెక్టర్‌ను కలుసుకున్నవారిలో డోలి సెహగల్‌, అపర్ణ, సతీ మధుసూదన్‌, ఉషా శ్రీనివాసన్‌, సునీత సజ్వాన్‌, వాసంతి లఖుమ్నా, నాగేశ్వరరావు, కమలేష్‌ కుమార్‌లు ఉన్నారు. వీరు జాతీయ హెల్త్‌ మిషన్‌, బేటి బచావో బేటి పడావో, కేజీబీవీ, స్వచ్ఛ భారత్‌ మిషన్‌, మిడ్‌ డే మీల్స్‌, ఉపాధి హామీ పథకం, రాష్ట్రీయ కషి వికాస యోజన, జాతీయ ఫసల్‌ బీమా యోజనతో పాటు రాష్ట్ర పథకాలైన కెసిఆర్‌ కిట్‌, ఆసరా పెన్షన్‌, తెలంగాణకు హరితహారం, మిషన్‌ భగీరథ, కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్‌, రైతుబంధు, కంటి వెలుగు, ఆరోగ్యశ్రీ పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో అమలును పరిశీలించనున్నారు.

వీరు గురువారం నుండి ఆగస్టు 28 వరకు గ్రామాలలో పర్యటించి పథకాల వల్ల ప్రజలకు ఏవిధంగా ప్రయోజనము చేకూరుతుందో, అమలు ఏవిధంగా ఉందో ప్రజలతో మాట్లాడి పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా వారికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరిస్తూ ఆసుపత్రుల్లో డెలివరీలు పెంచడంలో భాగంగా కెసిఆర్‌ కిట్టు పథకాన్ని అమలు చేస్తున్నారని, ఈ పథకం ద్వారా ఇన్స్టిట్యూషనల్‌ డెలివరీ సగటు పెరిగిందని కిట్టుతో పాటు నగదు మొత్తం కూడా మహిళలకు అందిస్తున్నారన్నారు. ఆసరా పెన్షన్‌ల వల్ల ఎంతో మంది పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చగా తీర్చిదిద్దడానికి, వాతావరణ సమతుల్యానికి హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన త్రాగు నీరు అందించే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పేదలకు వివాహ ఖర్చులను అందించడానికి ఎంతో మంచి ఆలోచనతో అమలు చేయడం జరుగుతుందన్నారు. రైతు బంధు పథకం ద్వారా రైతులందరికీ పెట్టుబడి ఖర్చులను అందించడానికి ప్రతి ఎకరాకు సంవత్సరానికి 10 వేలు చెల్లించడం జరుగుతుందన్నారు.

కంటి వెలుగు ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైనవారికి కంటి అద్దాలు అందించడంతోపాటు ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్నారని తెలిపారు. వ్యవసాయికంగా నిజామాబాద్‌ జిల్లా ఇతర జిల్లాల కంటే ముందు వరుసలో ఉందని రైతులు ఎంతో చైతన్యంతో పంటలవల్ల మంచి దిగుబడులు సాధిస్తున్నారని పసుపు, ఎర్రజొన్న ఇతర పంటలు దేశవ్యాప్తంగా జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకు రావడం జరిగిందన్నారు.

Check Also

జ్వరాలు రాకుండా ముందే నివారణ చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జ్వరాలతో వచ్చిన ప్రజలకు అవసరమైన చికిత్సలు అందించడంతోపాటు జ్వరాలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *