Breaking News
ఎంపీపీగా ప్రమాణస్వీకారం చేస్తున్న లోలపు రజినీ కిషోర్‌

రెంజల్‌ ఎంపీపీగా లోలపు రజినీ

రెంజల్‌, జూలై 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల ఎంపీపీగా లోలపు రజినీ కిషోర్‌ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఎంపీడీవో శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మండల ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ రాజేందర్‌ ఎంపీపీ లోలపు రజిని కిషోర్‌తో పాటు, వైస్‌ ఎంపిపి యోగేష్‌, మండల కో ఆప్షన్‌ సభ్యుడు అంతయ్య, ఎంపీటీసీ సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎంపీపీగా రజినీ కిషోర్‌ బాధ్యతలు స్వీకరించారు.

ఎంపీపీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర నాయకుడు బస్వలక్ష్మి నర్సయ్య, జిల్లా మాజీ అధ్యక్షుడు గంగారెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎంపిపి మాట్లాడుతూ సభ్యులందరు పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా మండల అభివద్ధికి కషి చేయాలని గ్రామాల్లో సమస్యలు పరిష్కారం దిశగా తమవంతు సహాయసహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌, వివిధ గ్రామాల సర్పంచ్‌లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జన్మదినం సందర్భంగా రక్తదానం

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గడ్డం సంపత్‌ ...

Comment on the article