Breaking News

కాలేశ్వరం ప్రాజెక్టు పనులకు రైతులు సహకరించాలి

నిజామాబాద్‌, జూలై 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాలేశ్వరం ప్రాజెక్ట్‌ ప్యాకేజీ 20, 21 పనులలో అంతరాయం కలుగకుండా రైతులు సహకరించాలని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాలు రవాణా గహ నిర్మాణ శాఖామంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి రైతులను కోరారు. శుక్రవారం సాయంత్రం మెంట్రాజ్‌పల్లిలో 100 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే 10 పంప్‌హౌస్‌ల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణంలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడితే సహకరించాలని పంప్‌ హౌస్‌ పైప్‌లైన్‌ పనులను సమాంతరంగా జరుగుతున్నాయని పైప్‌లైన్‌ పనుల సందర్భంగా రైతులు పూర్తి సహకారం అందిస్తేనే ఈ ప్రాంత బీడు భూములు సస్యశ్యామలం అవుతాయని చెప్పారు.

కాలేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైనదని ఏ రాజకీయ నాయకుడు ఏ ముఖ్యమంత్రి చేయని పనులు మన ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని తెలంగాణ వస్తే బీడు భూములను సస్యశ్యామలం చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం ఎంతో కషి చేస్తున్నదని ప్యాకెట్‌ 21 కింద 750 కోట్ల అంచనా వ్యయంతో కాలువల ద్వారా సాగునీరు అందించాలని ముందు నిర్ణయం తీసుకోగా దానికి భూసేకరణ ఎక్కువ చేయవలసిన అవసరముందని భావించి పైప్‌లైన్‌ ద్వారా మంచిప్పుల ప్రాజెక్టు పనులను 2600 కోట్లు మంజూరు చేశారని ప్రతి 50 ఎకరాలకు ప్రధాన పైప్‌లైన్‌ ప్రతి మూడు ఎకరాలకు సబ్‌ పైప్‌ లైన్‌ (బోరు లాంటిది) వేసి సాగునీరు అందించనున్నట్లు, అందుకోసం మొత్తం 2,600 కోట్ల అంచనా వ్యయంతో పైప్‌లైన్‌ మంచుప్పుల ప్రాజెక్టు పనులు కోసం ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. పడకల్‌, మెట్‌పల్లి కాల్వ ద్వారా 85,000 ఎకరాలు గడుకోలు, మంచుప్పుల ద్వారా లక్షా 25 వేలు ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు.

కాలేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్‌ 20, 21 చేపట్టే పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షించడం జరుగుతుందని చెప్పారు. నిజామాబాద్‌ రూరల్‌ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ మాట్లాడుతూ రూరల్‌ నియోజకవర్గంలోని రైతుల భూములకు సాగునీరందించేందుకు తాను మంత్రివర్యులు కోరినవెంటనే ఖర్చులకు వెనుకాడకుండా ముఖ్యమంత్రి నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడం జరిగిందని మంచుప్పుల ప్రాజెక్టు నిర్మాణ పనులు కాళేశ్వరం పైప్‌లైన్‌ పనులకు రెండువేల 600 కోట్లను మంజూరు చేయడం జరిగిందని, మంజూరైన పనులను నిర్దేశించిన గడువు కంటే ముందే పూర్తి చేసేందుకు కషి చేయాలని మంత్రిని అధికారులను కోరారు. మంత్రి వెంట సిఇ మధుసూదన రావు, ఈఈ ఆత్మరామ్‌, ధర్పల్లి జడ్పిటిసి జగన్‌, ఇంజనీరింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *