Breaking News

Daily Archives: July 6, 2019

వైద్యం నిమిత్తం 3.50 లక్షలు మంజూరి

నిజాంసాగర్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెద్ద కొడపగల్‌ మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన మెనూరి అంజయ్యకు వైద్యం నిమిత్తం అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే సీఎం సహాయనిది నుండి 3.50 లక్షల రూపాయలు మంజూరి చేయించారు. మంజూరి పత్రాన్ని శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రోగి అన్న మెనూరి గంగారాంకు అందచేశారు. ఈ సందర్భంగా గంగారాం మాట్లాడుతూ తన తమ్ముడు అంజయ్య గత నాలుగు నెలలుగా ఎప్లాస్టిక్‌ ఎనిమియా అనే వ్యాధితో బాధపడుతున్నాడని తెలిపారు. వైద్యం ...

Read More »

నాటిన మొక్కలను సంరక్షించాలి

నిజాంసాగర్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాటిన ప్రతి ఒక్క మొక్కను సంరక్షించాలని వెల్గనూర్‌ సర్పంచ్‌ రమేష్‌ గౌడ్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని వెల్గనూర్‌ గ్రామ శివారులో సర్పంచ్‌ రమేష్‌ గౌడ్‌, పంచాయతీ కార్యదర్శి సుధాకర్‌ కలిసి మొక్కలను నాటారు. అనంతరం సర్పంచ్‌ రమేష్‌ గౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరు చేపట్టాలని అన్నారు. మొక్కలు పెంచడం వల్ల ఎన్నో లాభాలున్నాయన్నారు. ఆయన వెంట గ్రామ ...

Read More »

తెరాస పార్టీకి అపూర్వ స్పందన

బీర్కూర్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురులాబాద్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో తెరాస పార్టీ సభ్యత్వానికి అపూర్వ స్పందన లభిస్తుందని మండల తెరాస పార్టీ అద్యక్షుడు ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో తెరాస సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రబుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు చూసి ఆయా గ్రామాల్లో ప్రజలు తెరాస పార్టీలో చేరుతున్నరన్నారు. తెరాస కార్యకర్తలకు అనుకోకుండా ప్రమాదాలు జరిగితే భీమా వర్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి విటల్‌, తెరాస గ్రామ ...

Read More »

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

నిజాంసాగర్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొక్కల సంరక్షణ అందరి బాధ్యత అని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి, జెడ్పి చైర్‌ పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌ రెడ్డిలు అన్నారు. శనివారం మొక్కలు నాటిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఒక్కరు ఆరు మొక్కలు నాటి వాటి సంరక్షణ చేయాలని కోరారు.

Read More »

తెరాసతోనే అభివద్ధి

నిజాంసాగర్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ మండలం నిజాంపేట్‌ గ్రామంలో 17 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవనాన్ని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, జెడ్పి చైర్మన్‌ మంజుశ్రీ జైపాల్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ పాలనలోనే గ్రామాల అభివద్ధి జరుగుతుందన్నారు. ఆడపడుచుల కోసం మిషన్‌ భగీరథ పథకం కింద ఇంటింటికి మంచి నీటిని ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు, సర్పంచ్‌లు తదితరులు ఉన్నారు.

Read More »

అంగన్‌వాడి టీచర్‌, ఆయాల ఎంపిక

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ (ఐసిడిఎస్‌) వయోవద్ధుల శాఖ నిజామాబాద్‌ వారిచే జిల్లాలో అంగన్‌వాడి టీచర్‌, ఆయాల ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులను మెరిట్‌ ప్రాతిపదికన ఎంపిక చేయడం జరిగిందని జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ (పిడి ఐసిడిఎస్‌) స్రవంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల జాబితా సంబంధిత సిడిపిఓ కార్యాలయాల నోటీస్‌ బోర్డ్‌లపై ప్రదర్శించడం జరిగిందని చెప్పారు. ఎంపిక కాబడిన అభ్యర్థుల పోస్టింగ్‌ ఉత్తర్వులు ...

Read More »