Breaking News

అంగన్‌వాడి టీచర్‌, ఆయాల ఎంపిక

నిజామాబాద్‌, జూలై 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ (ఐసిడిఎస్‌) వయోవద్ధుల శాఖ నిజామాబాద్‌ వారిచే జిల్లాలో అంగన్‌వాడి టీచర్‌, ఆయాల ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులను మెరిట్‌ ప్రాతిపదికన ఎంపిక చేయడం జరిగిందని జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ (పిడి ఐసిడిఎస్‌) స్రవంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల జాబితా సంబంధిత సిడిపిఓ కార్యాలయాల నోటీస్‌ బోర్డ్‌లపై ప్రదర్శించడం జరిగిందని చెప్పారు.

ఎంపిక కాబడిన అభ్యర్థుల పోస్టింగ్‌ ఉత్తర్వులు రిజిస్టర్‌ పోస్టు ద్వారా వారి యొక్క చిరునామాకు సంబంధిత సిడిపివో కార్యాలయం ద్వారా పంపించ బడతాయని, ఉత్తర్వులు అందిన వెంటనే సంబంధిత సిడిపివో కార్యాలయాలకు వెళ్లి ఎంపిక కాబడిన అభ్యర్థినులు, వారికి కేటాయించబడిన, ఉద్యోగంలో జాయిన్‌ కావాలని చెప్పారు. ఎంపిక కాబడిన అభ్యర్థులు ఎవరైనా ఎటువంటి ప్రలోభాలకు లావాదేవీలకు పాల్పడి మోసాలకు గురికావద్దని పిడి ఐసిడిఎస్‌ బి.స్రవంతి తెలిపారు.

Check Also

పూడికతీత పనుల‌ పరిశీల‌న

నిజామాబాద్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 1 నుండి 8 వ తేదీ వరకు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *