Breaking News

Daily Archives: July 8, 2019

కామారెడ్డిలో సైకిల్‌ జాత

కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి జిల్లాలో సైకిల్‌ జాత నిర్వహించారు. సదాశివనగర్‌ మండల కేంద్రంలో బాలుర వసతి గృహం నుంచి ఉదయం 9 గంటలకు యాత్ర ప్రారంభమైంది. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

10న విద్యాసంస్థల బంద్‌

కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 10న రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌ నిర్వహిస్తున్నట్టు విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. ఈ మేరకు సోమవారం పోస్టర్లను కామారెడ్డి ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కేజీ నుడి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామనిచెప్పి అమలు పరచడంలో విఫలమైందన్నారు. ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలన్నారు. టిఆర్‌టి అభ్యర్థులకు వెంటనే పోస్టింగ్‌ ఇవ్వాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస మౌలిక ...

Read More »

జోరుగా తెరాస సభ్యత్వ నమోదు

నందిపేట, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో సోమవారం టిఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా జరిగింది. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్నీ వర్గాల ప్రజలకు లబ్ది చేకూర్చే కార్యక్రమాలు చేస్తున్నందున ప్రజలే ఉత్సాహంగా ముందుకు వచ్చి సభ్యత్వాలు తీసుకుంటున్నారని ఆర్మూర్‌ నియోజకవర్గ టిఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు ఇంచార్జి బాపురెడ్డి పేర్కొన్నారు. నమోదు కార్యక్రమంలో నందిపేట్‌ మండల టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు గాదెపల్లి సర్పంచ్‌ నక్కల భూమేస్‌, ఎంపిపి వకిడి సంతోష్‌, కో ...

Read More »

పోలీసు కవాతు

నందిపేట, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలో సోమవారం ఉదయం రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలతో పాటు స్థానిక పోలీసులు కవాతు నిర్వహించారు. నందిపేట్‌ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కవాతు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్మూర్‌ ఏసిపి అందె రాములు మాట్లాడుతూ గ్రామాలలో వదంతులు నమ్మవద్దన్నారు. ఏదైనా అనుమానం కలిగితే పోలీసులకు సమాచారం అందించి శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు. విభిన్న కుల మతాల ప్రజలు కలిసి మెలిసి ఉంటూ శాంతిని పెంచాలని సూచించారు. ...

Read More »

నూతన కార్యవర్గానికి సన్మానం

కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి బట్టల వర్తక సంఘం నూతన కార్యవర్గ సభ్యులను సోమవారం సన్మానించారు. అధ్యక్షునిగా గడీల నర్సింలు, సెక్రటరీగా చింతల రవిందర్‌ గౌడ్‌, కోశాధికారిగా సింగం పరమేశ్వర్‌లను మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ కైలాస్‌ శ్రీనివాస్‌ రావు సన్మానించారు. కార్యక్రమంలో దాత్రిక సత్యం, పండ్ల రాజు, హనుమండ్ల రాజు, జమాల్‌ పూర్‌ సుధాకర్‌, సునీల్‌ గౌడ్‌, తాజ్‌ పాల్గొన్నారు. సంఘ అభివద్ధికి కషి చేయాలనీ సూచించారు.

Read More »

నీటి సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భవిష్యత్తులో వచ్చే నీటి సమస్యలను దష్టిలో పెట్టుకొని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని జల శక్తి యోజన జాతీయ నోడల్‌ అధికారి, కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ సంయుక్త కార్యదర్శి, సీఈఓ నికుంజ కిషోర్‌ సుందరాయ్‌ తెలిపారు. జలశక్తి అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మూడు రోజుల పర్యటనకు ఆయన ఆదివారం రాత్రి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌ ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో జలశక్తి ...

Read More »

ప్రజావాణి ద్వారా సమస్యల పరిష్కారం

బీర్కూర్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ద్వారా సమస్యల పరిష్కారం జరుగుతుందని నసురుల్లాబాద్‌ తహసీల్ధర్‌ అర్చన అన్నారు. మండల కేంద్రంలో సోమవారం తహసీల్‌ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా తహసీల్దార్‌ అర్చన మాట్లాడుతూ గతంలో ప్రజావాణి కార్యక్రమం జిల్లా కేంద్రంలో మాత్రమే నిర్వహించేవారని ప్రస్తుతం మండల స్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసు కోవాలని సూచించారు. సోమవారం ప్రజావాణిలో రెండు దరఖాస్తులు వచ్చాయని సంబంధిత అధికారులకు సమస్య పరిష్కారం కోసం ...

Read More »

నాయకులకు పిఆర్‌టియు సభ్యుల సన్మానం

బీర్కూర్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలో నూతనంగా ఎన్నికైన ప్రాధెశిక సభ్యులైన ఎంపీపీ విఠల్‌, వైస్‌ ఎంపీపీ ప్రభాకర్‌ రెడ్డి, జడ్పీటీసీ జన్నుబాయి, ఎంపీటీసీ వంగ పుష్పలను సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలో మండల పిఆర్‌టియు అధ్యక్షుడు హన్మండ్లు ఆద్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా హన్మాండ్లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేలా నాయకులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పిఆర్‌టియు మాజీ అద్యక్షుడు కొప్పిశెట్టి శ్రీనివాస్‌, నాగభూషణం, విఠల్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

మొక్కల సంరక్షణ చేపట్టాలి

బీర్కూర్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని హజిపూర్‌ గ్రామంలో సోమవారం ఎంపీపీ విఠల్‌ హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బాధ్యతగా హరిత హారంలో తమ ఇంటి పరిసరాల్లో, పంట పొలాల్లో మొక్కలు నాటీ వాటి సంరక్షణ చేపట్టాలని సూచించారు. చెట్లను పెంచడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జన్నుబాయి, గ్రామ సర్పంచ్‌ అంజయ్య, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మెన్‌ ...

Read More »

పశువులకు గాలికుంటు టీకాలు

బీర్కూర్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని మైలారం గ్రామంలో సోమవారం పశు వైద్య అధికారులు ఆవులకు, గేదెలకు సోమవారం ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేశారు. ఈ సందర్బంగా గ్రామసర్పంచ్‌ యశోద మహేందర్‌ మాట్లాడుతూ వర్షాకాలంలో పశువులకు వచ్చే గాలికుంటు వ్యాధి నివారణకు గ్రామంలో 162 గేదెలకు, 8 ఆవులకు ఉచితంగా టీకాలు వేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ ప్రభాకర్‌ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మహేందర్‌, వైద్యాధికారులు రోహిత్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రావు, సంతోష్‌ రెడ్డి ...

Read More »

ప్రజావాణి, జలశక్తి అభియాన్‌లపై అధికారులతో సమీక్ష

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల వ్యక్తిగత సామాజిక సమస్యల కోసం విన్నవించే ఆర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రగతిభవన్‌లో ప్రజావాణి సందర్భంగా అధికారులనుద్దేశించి మాట్లాడుతూ ప్రజావాణి సందర్భంగా విన్నపాలను ఆయా శాఖల అధికారులు ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని, ప్రజల నుండి విన్నపాలు తగ్గే విధంగా ముఖ్యంగా గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిలో సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని చెప్పారు. వివిధ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన ...

Read More »

మునిసిపల్‌ ఎన్నికల కోసం కార్యకర్తలు సన్నద్దం కావాలి

కామారెడ్డి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో మాజీ మంత్రి, శాసన మండలి మాజీ ప్రతిపక్ష నేత మహ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని 4, 5, 6, 7, 8 వార్డులలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ మున్సిపల్‌ కోర్‌ కమిటీ సభ్యులు కారంగుల అశోక్‌ రెడ్డి, పండ్ల రాజు, మోత్కూరి శ్రీనివాస్‌, సయ్యద్‌ అన్వర్‌, అహ్మద్‌ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కాంగ్రెస్‌ పార్టీని పటిష్టపరిచి రాబోయే మునిసిపల్‌ ఎన్నికల్లో ...

Read More »

పిల్లలను గమనిస్తూ ఉండండి

నిజామాబాద్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిల్లలు పాఠశాల నుండి కానీ ఇంటి నుండి కానీ బయటకు వెళ్ళినప్పుడు అధ్యాపకులు, తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాకాలం మూలంగా అక్కడక్కడ గుంతలలో కుంటలలో నీరు చేరి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని తెలిపారు. చిన్నపిల్లలు పాఠశాలలలో చదివే విద్యార్థులు ఆటల కోసం ఇతర కార్యక్రమాలలో అటువైపుగా వెళ్లి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. పాఠశాల సమయంలో అధ్యాపకులు, తోటి విద్యార్థులు, ...

Read More »

ఏఐఎస్‌ఎఫ్‌ సైకిల్‌ జాత

కామారెడ్డి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐఎస్‌ఎఫ్‌ ఆద్వర్యంలో విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న సైకిల్‌ జాత ఆదివారం కామారెడ్డి జిల్లా గాంధారికి చేరుకుంది. ఈ సందర్బంగా మండల కేంద్రంలోని బాలుర వసతి గృహం నుంచి యాత్ర ప్రారంభించారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

బిజెపి సభ్యత్వ నమోదు

కామారెడ్డి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్నిన నిజామాబాద్‌ ఎంపి ధర్మపురి అర్వింద్‌ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపి మాట్లాడారు. రానున్న రోజుల్లో తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దష్టి సారించబోతుందని, ఇందుకుసంబంధించి అమిత్‌ షా పర్యటనలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారన్నారు. 70 సంవత్సరాల అవినీతిని తొలగించడానికి నిఖార్సయిన ప్రభుత్వాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో పార్టీ కార్యకర్తలు పనిచేయాలన్నారు. ...

Read More »