Breaking News

పిల్లలను గమనిస్తూ ఉండండి

నిజామాబాద్‌, జూలై 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిల్లలు పాఠశాల నుండి కానీ ఇంటి నుండి కానీ బయటకు వెళ్ళినప్పుడు అధ్యాపకులు, తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాకాలం మూలంగా అక్కడక్కడ గుంతలలో కుంటలలో నీరు చేరి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని తెలిపారు. చిన్నపిల్లలు పాఠశాలలలో చదివే విద్యార్థులు ఆటల కోసం ఇతర కార్యక్రమాలలో అటువైపుగా వెళ్లి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. పాఠశాల సమయంలో అధ్యాపకులు, తోటి విద్యార్థులు, సిబ్బంది విద్యార్థులు ఎటు వైపు వెళ్తున్నారో గమనించాలని తెలిపారు.

అదేవిధంగా ఇంటి వద్ద ఉన్న సమయంలో బయటికి వెళ్లినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో ఎందుకు వెళుతున్నారో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గమనించాలని బయటకు వెళ్ళేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు చెప్పాలని ఆయన కోరారు. ప్రమాదకరంగా ఉన్న కుంటలు, గుంతల విషయంలో అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అదేవిధంగా కాలువలు, చెరువుగట్లు వాటి పనితీరు పరిస్థితిని గమనించి బలహీనంగా ఉన్న వాటి మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

అవసరమైన రోడ్లు, కల్వర్టుల మరమ్మతులకు అవసరమైన చోట చర్యలు తీసుకోవాలని వర్షాల వల్ల ప్రజలకు ప్రమాదాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయమై ఇప్పటికే అధికారులతో సమావేశం ద్వారా ఆదేశించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ దిశగా సంబంధిత శాఖల అధికారులు వెంటనే చర్యలు తీసుకొని నివేదికలు సమర్పించాలని కలెక్టర్‌ ప్రకటనలో ఆదేశించారు.

Check Also

జనహిత పెండింగ్‌ దరఖాస్తులు పరిస్కరించాలి

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనహితలోని పెండింగ్‌ దరఖాస్తులను అదికారులు వెంటనే పరిశీలించి పరిస్కరించాలని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *