Breaking News

ప్రజావాణి, జలశక్తి అభియాన్‌లపై అధికారులతో సమీక్ష

నిజామాబాద్‌, జూలై 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల వ్యక్తిగత సామాజిక సమస్యల కోసం విన్నవించే ఆర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రగతిభవన్‌లో ప్రజావాణి సందర్భంగా అధికారులనుద్దేశించి మాట్లాడుతూ ప్రజావాణి సందర్భంగా విన్నపాలను ఆయా శాఖల అధికారులు ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని, ప్రజల నుండి విన్నపాలు తగ్గే విధంగా ముఖ్యంగా గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిలో సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని చెప్పారు. వివిధ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరలేక పోయినందున ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ కార్యక్రమాలను ఆయా శాఖలు నిర్దేశించిన ప్రకారంగా గడువులోగా అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలని చెప్పారు.

విద్యాసంస్థలు చదువుతున్న విద్యార్థుల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, అజాగ్రత్త వలన అనుకోని సంఘటన జరిగిన పక్షంలో సంబంధిత శాఖలే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఈ విషయంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాలు తీవ్రంగా కురుస్తున్నందున చెరువులు, కుంటలు తెగిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని బలహీనమైన చెరువుల ఆనకట్టలు తూములు ముందస్తుగా పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఏలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వర్షపునీటిని వధా చేయకుండా వాటిని సంరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న జల్‌శక్తి అభియాన్‌ కార్యక్రమంలో అందరిని భాగస్వామ్యం చేసి నీటి సంరక్షణకు అనేక రకాలైన పద్ధతుల ద్వారా చేపట్టనున్నట్లు చెప్పారు.

జిల్లాలో వందరోజుల కార్యాచరణ తయారుచేసి తద్వారా జల రక్షణకు పాటుపడతామని చెప్పారు. జిల్లాలో ఇప్పటికీ చేపట్టిన వివిధ రకాల జల రక్షణ పద్ధతులను కొనసాగిస్తూనే వాటి పునరుద్ధరణకు కషితో పాటుగా నూతనంగా జల సంరక్షణకు మరిన్ని జల వనరులు ఏర్పాటు చేయటానికి చర్యలు తీసుకోనున్నట్లు జిల్లాలో వాటర్‌ షెడ్‌ మేనేజ్‌మెంట్‌ అమలు చేయనున్నట్టు చెప్పారు. దేశంలో 256 జిల్లాల్లో జల్‌శక్తి అభియాన్‌ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుండగా, జిల్లాకు సంబంధించిన సమాచారం ఏర్పాటుచేసిన పోర్టల్‌లో సకాలంలో నమోదు చేయాలని అవసరమైన సమాచారాన్ని నమోదు చేసే విధంగా కషి చేయాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, నిజామాబాద్‌ ఆర్‌డిఓ వెంకటేశ్వర్లు, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *