Breaking News

మాచారెడ్డికి సైకిల్‌ జాత

కామారెడ్డి, జూలై 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలంలోని బాలుర వసతి గృహానికి ఏఐఎస్‌ఎప్‌ సైకిల్‌ జాత చేరుకుంది. ఈ సంధర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకుడు గణేష్‌ మాట్లాడుతూ జిల్లాలో విద్యారంగ సమస్యలు విద్యార్థులకు నిలయంగా మారాయని అన్నారు. అంతే కాకుండా విద్యార్థులకు కనీసం స్కాలర్‌షిప్‌లు ఇవ్వని పరిస్థితులు ఉన్నాయని కేజీ నుంచి పిజి ఉచిత విద్య అని చెప్పిన కేసీఆర్‌ నేడు ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలకు వత్తాసు పలుకుతున్నారన్నారు.

సంక్షేమ హాస్టల్‌, జూనియర్‌ కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. శిథిలావస్థకు చేరుకున్న భవనాలకు నూతన భవనాలు నిర్మించాలని, ఖాళీగా ఉన్నటువంటి టీచర్‌, లెక్చరర్‌, వార్డెన్‌ పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. బడ్జెట్‌లో విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వం 30 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం కేటాయించాలని, యూనివర్సిటీలకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని కామారెడ్డి జిల్లాలో బీఈడి, ఇంజనీరింగ్‌ కళాశాలలు ఏర్పాటు చేయాలని అన్నారు. గుర్తింపులేని ప్రయివేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సైకిల్‌ జాత బృందం జిల్లా నాయకుడు కుంచాల గణేష్‌, సాయి చైతన్య, శ్రవణ్‌, ప్రశాంత్‌ పాల్గొన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *