Breaking News

వేతనాల కోసం ధర్నా

కామారెడ్డి, జూలై 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపాలిటీ విలీన గ్రామాల నర్సరీ కార్మికుల వేతనాలు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉండడాన్ని అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏఐసిటియు ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం ముందు మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏఐసిటియు జిల్లా బాధ్యులు రాజలింగం మాట్లాడుతూ మున్సిపల్‌ విలీన గ్రామాల్లో గతం నుంచి కొనసాగుతున్న నర్సరీ యొక్క నిర్వహణ కార్మికులు 100 మంది వరకు ఉంటారు.

కాగా వీరికి మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా జిల్లా కలెక్టర్‌కు విన్నవించినా ఫలితం లేదని, తక్షణం వేతనాలు ఇవ్వకుంటే మున్సిపల్‌ కార్యాలయం నుండి కదిలేది లేదని స్పష్టం చేశారు. దీంతో మున్సిపల్‌ కమిషనర్‌ మాట్లాడుతూ సాయంత్రం వరకు వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చారు. నర్సరీ కార్మికుల యొక్క శాశ్వత ఉపాధి కోసం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో నర్సరీ కార్మికుల యూనియన్‌ నాయకులు నరసింహ స్వామి, బాలరాజు, రాజు, నరేష్‌, నారాయణ, రాజమణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాలుగు మున్సిపాలిటీలలో 25వ తేదీ శనివారం ఉదయం 8 ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *