Breaking News

కలెక్టర్‌కు వినతి

కామారెడ్డి, జూలై 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన దేశంలో హిందూ ధర్మంపైన, దేవాలయాలపైన మతోన్మాదుల దాడులు అనేకంగా పెరుగుతున్నాయని విశ్వహిందూ పరిషత్‌ పేర్కొంది. ఇటీవల ఢిల్లీలో దుర్గాదేవి ఆలయం మీద దాడి జరిగిందని, దేశంలో లవ్‌ జీహాద్‌ ద్వారా మతమార్పిడులు అధికామవుతున్నాయని విహెచ్‌పి సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలను విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌ దళ్‌ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

ఈ విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనే ఉద్దేశ్యంలో భాగంగా దేశవ్యాప్తంగా ఒకే సమయంలో ప్రతీ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయానికి చేరుకుని జిల్లా కలెక్టరుకు మర్యాదపూర్వకంగా వినతిపత్రం సమర్పించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో విహెచ్‌పి జిల్లా గౌరవాధ్యక్షులు గోపాలకష్ణ, కార్యదర్శి జంగిటి శ్రీనివాస్‌, పాపిరెడ్డి, రామోజ్‌ రవి, మహేష్‌, నవీన్‌, సందీప్‌, బాలు, అమర్‌నాథ్‌, సాయికిరణ్‌, రాజు ఉన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *