Breaking News
బీజేపీ సభ్యత్వ నమోదు అందజేస్తున్న యెండల లక్ష్మీనారాయణ

సభ్యత్వ నమోదులో యువత కీలకం

రెంజల్‌, జూలై 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి పార్టీ సభ్యత్వ నమోదులో యువతే కీలకమని భారతీయ జనతాపార్టీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. రెంజల్‌ మండలం నీలా గ్రామంలో బిజెపి మండల అధ్యక్షుడు మేక సంతోష్‌, పార్టీ సీనియర్‌ నాయకుడు సాంబశివరావు ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీపీ లోలపు రజినీ కిషోర్‌, జడ్పీటీసీ మేక విజయ సంతోష్‌లతో కలిసి పలువురికి సభ్యత్వం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చూపు మోడీవైపు ఉందని ప్రధాని మోదీ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి యువత, ప్రజలు ముందుకు వస్తున్నారన్నారు.

గతంలో ఏ పార్టీ చేయని అభివద్ధిని మోడీ ప్రభుత్వం అనతికాలంలోనే చేసి చూపించిదని గత ప్రభుత్వాలకు భిన్నంగా అనేక సంక్షేమ పథకాలను ప్రతి నిరుపేద కుటుంబానికి చేరే విధంగా అన్ని రాష్ట్రాలను సమన్వయ పరుస్తూ ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం బిజెపి ప్రభుత్వమేనన్నారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారతదేశం వైపు మొగ్గు చూపుతున్నాయని విదేశాల్లో భారతీయులకు గౌరవం పెరిగింది అంటే అది ప్రధాని మోడీ కషి వల్లనే సాధ్యమైందన్నారు. ప్రస్తుతం దేశం మొత్తంలో 11 కోట్ల మంది బిజెపి సభ్యులు ఉండగా ఈ సంవత్సరం 20 శాతం అదనంగా సభ్యత్వ నమోదు చేస్తామన్నారు.

తెలంగాణలో 18 లక్షల మంది బిజెపి సభ్యులు ఉండగా కొత్తగా మరో 18 లక్షల మంది సభ్యత్వాలకు శ్రీకారం చుట్టడానికి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాని నేపథ్యంలో శ్రీకారం చుట్టడం జరిగిందని తెలంగాణలో రాబోయే ఐదేళ్లలో బిజెపి ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు డాక్టర్‌ శివప్ప, సుభాష్‌, వెంకటేశ్వరరావు, ఎంపిటిసిలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

జనహిత పెండింగ్‌ దరఖాస్తులు పరిస్కరించాలి

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనహితలోని పెండింగ్‌ దరఖాస్తులను అదికారులు వెంటనే పరిశీలించి పరిస్కరించాలని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *