Breaking News

తెరాస పేదల ప్రభుత్వం

బీర్కూర్‌, జూలై 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వమని తెరాస రాష్ట్ర నాయకులు, సభాపతి తనయుడు పోచారం సురేందర్‌ రెడ్డి అన్నారు. మండలంలోని నెమ్లి గ్రామంలో బుధవారం బోయి కుటుంభ సభ్యుల కొరకు నూతనంగా నిర్మించనున్న 20 రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణానికి భూమి పూజ చేసారు. అనంతరం గ్రామంలో తెరాస సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, రాష్ట్రంలో అర్హులైన ప్రతి నిరుపేదకు రెండు పడక గదుల ఇళ్ళు అందజేస్తున్నామన్నారు. పేదల కోసం, రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత తెరాస ప్రభుత్వానికే చెందుతుందన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ జడ్పీ చైర్మెన్‌ విఠల్‌ రావు, ఎంపీపీ విఠల్‌, వైస్‌ ఎంపీపీ ప్రభాకర్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజి చైర్మెన్‌ పెరుక శ్రీనివాస్‌, సర్పంచ్‌ నాగమణి, ఎంపీటీసీ రాధా గ్రామస్తులు పాల్గొన్నారు.

Check Also

జనహిత పెండింగ్‌ దరఖాస్తులు పరిస్కరించాలి

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనహితలోని పెండింగ్‌ దరఖాస్తులను అదికారులు వెంటనే పరిశీలించి పరిస్కరించాలని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *