Breaking News

ప్లాస్టిక్‌ రహిత గ్రామంగా గుర్తింపు తెచ్చుకోవాలి

నిజామాబాద్‌, జూలై 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామాన్ని ప్లాస్టిక్‌ రహితంగా గుర్తింపు తెచ్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రెటరీ జలశక్తి అభియాన్‌ అమలు జిల్లా నోడల్‌ అధికారి నికుంజ్‌ కిషోర్‌ సుంద రాయ్‌ అన్నారు. వర్షపు నీటి సంరక్షణ పద్ధతులపై గ్రామపంచాయతీ భవనములో సర్పంచ్‌ ఎంపిటిసి వార్డ్‌ మెంబర్‌తో పాటుగా ప్రజలకు ఏర్పాటుచేసిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామంలో పడిన వర్షం నీటి కంటే ఎక్కువగా వినియోగించుకుంటున్నారని అందువలన భూగర్భ జలాలు లోపలికి వెళ్తున్నాయని జలశక్తి అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన 38 గ్రామాలలో తిమ్మాపూర్‌ గ్రామం కూడా ఒకటని చెప్పారు.

వర్షపునీటిని సంరక్షించుకునేందుకు అనేక పద్ధతులు ఉన్నాయని అందులోఫామ్‌ ఫాండ్స్‌, చెక్‌ డ్యాములు, ఇంకుడు గుంతలు, సోప్‌ ఫిట్స్‌ మేజిక్‌ సోప్‌ ఫిట్స్‌ ద్వారా వర్షపు నీటిని సంరక్షించుకోవచ్చునని, తద్వారా భూగర్భ జలాలు పెరిగి సాగునీరు, తాగునీటికి కొరత ఏర్పడదని వివరించారు. గ్రామంలో ప్లాస్టిక్‌ను వాడకూడదని ప్లాస్టిక్‌ నిరోధానికి ప్రజలను అప్రమత్తం చేయాలని ప్లాస్టిక్‌ వాడకం వలన ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని, గ్రామస్తులు కలిసి ప్లాస్టిక్‌ వాడకాన్ని నిరోధించాలని కోరారు. జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ ప్రతి నీటి బొట్టును సంరక్షించుకోవాలన్నారు.

వర్షపునీటిని సక్రమంగా వినియోగించుకొని తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించుకోవాలని నీటి సంరక్షణ కొరకు పాటించవలసిన సలహాలు సూచనలు జిల్లా అధికారులు అందిస్తారని తెలిపారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటలు పండించాలని చెప్పారు. జల సంరక్షణ ఒక్క అధికారితో కాదని అందరూ కలిస్తేనే అనుకున్న ఫలితాలు సాధిస్తామని అందుకు అందరి సమిష్టి కషి అవసరమని చెప్పారు. జల్‌శక్తి అభియాన్‌ కార్యక్రమాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు కషి చేయాలని ఆయన కోరారు. వర్షపు నీటి కంటే ఎక్కువగా వాడకుండా వాటిని సద్వినియోగం చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం దేశంలో 256 జిల్లాలో అమలు చేస్తున్న మన జిల్లా కూడా ఎంపికైనట్లు చెప్పారు.

నీటిని వద్ధి పెంపొందించడానికి ప్రతి ఒక్కరు బాధ్యతగా కషి చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ నోడల్‌ అధికారితో కలిసి ప్రభుత్వ హైస్కూల్లో మొక్కలు నాటారు. హరిత హారంలో చేపట్టిన ఈత వనాన్ని పరిశీలించారు. అక్కడే ఉన్న గుట్టపై ఖండిత కందకాలను (సిసిటి) సబ్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన భూగర్భ జలాల నీటిమట్టాన్ని నోడల్‌ అధికారితో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో డిఆర్‌డివో రాథోడ్‌ రమేష్‌, గ్రౌండ్‌ వాటర్‌ డిడి ప్రసాద్‌, హార్టికల్చర్‌ డీడీ నర్సింగ్‌ దాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మండల క్రీడా పోటీలు ప్రారంభం

నందిపేట్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల అంతర పాఠశాలల క్రీడలు వెల్మల్‌ ప్రభుత్వ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *