Breaking News

జాతీయస్థాయి గుర్తింపు కోసం అంకాపూర్‌ కృషి

నిజామాబాద్‌, జూలై 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జలశక్తి అభియాన్‌ కార్యక్రమాలలో చేపట్టే జలసంరక్షణలో అంకాపూర్‌ గ్రామం జాతీయస్థాయిలో గుర్తింపు పొందే విధంగా గ్రామస్తులు కషి చేయాలని కేంద్ర ప్రభుత్వ సాంఘిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రెటరీ, జలశక్తి అభియాన్‌ జిల్లా నోడల్‌ అధికారి నికుంజ్‌ కిషోర్‌ సుందరాయ్‌ అన్నారు. బుధవారం ఆర్మూర్‌ మండలంలోని అంకాపూర్‌ గ్రామంలో జలశక్తి అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా జల సంరక్షణపై పాఠశాల విద్యార్థులచే ఏర్పాటుచేసిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావుతో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా నోడల్‌ అధికారి మాట్లాడుతూ నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ గ్రామం ఎంతో గుర్తింపు పొందిందని ఇక్కడ ప్రజలు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నందున జలశక్తి అభియాన్‌ కార్యక్రమం కూడా జాతీయస్థాయిలో పొందేందుకు రైతులు, ప్రజలు భాగస్వాములు కావాలని చెప్పారు. 150 మంది ఎన్‌ఆర్‌ఐలు ఉన్నారని పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించి గ్రామ విద్యార్థులకు విద్యా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిసిందని, జలశక్తి అభియాన్‌లో కూడా ఒక్కొక్క ఫామ్‌ పాండ్‌ ఏర్పాటుకు ఒక ఎన్‌ఆర్‌ఐ సహాయం చేసే విధంగా వారితో మాట్లాడాలని అవసరమైతే గ్రామ ప్రజలు వారితో వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసుకొని సాయం పొందే విధంగా కషి చేయాలన్నారు.

సన్న, చిన్నకారు రైతులకు ఫామ్‌ ఫాండ్‌ నిర్మాణానికి వ్యయం అవుతుందని వారికి ప్రభుత్వం కూడా సాయం చేస్తుందని చెప్పారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలని నిన్న గ్రామ చెరువులో ప్లాస్టిక్‌ తొలగించినప్పటికీ ఉదయం చూసేసరికి తిరిగి అక్కడే ప్లాస్టిక్‌ వేశారని చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజల సమిష్టి కషితో ఏ కార్యక్రమమైనా విజయవంతం చేయవచ్చనే అభిప్రాయంతోనే జలశక్తి అభియాన్‌ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ వర్షపునీటిని దుర్వినియోగం కాకుండా ఎలా ఉపయోగించుకొని భూగర్భ జలాలు ఏ విధంగా పెంచవచ్చునో ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తామని, ఉన్న నీటిని సరైన విధంగా వాడుకొనే విధంగా తక్కువ నీటితో ఎక్కువ పంటలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని జలశక్తి అభియాన్‌ కార్యక్రమంలో ముందస్తు తయారుచేసిన’యాక్షన్‌ ప్లాన్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని చెప్పారు.

ప్రజల భాగస్వామ్యం ప్రజాప్రతినిధుల సహకారం ఉంటే ఏ పథకమైన విజయవంతమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో డిఆర్‌డివో రాథోడ్‌ రమేష్‌, భూగర్భ జల డిడి అర్‌డి ప్రసాద్‌ హార్టికల్చర్‌ డిడి నర్సింగ్‌, దాస్‌, ఎంపీడీవో, తహసిల్దార్‌, గ్రామసర్పంచ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *