Breaking News

అగ్రికల్చర్‌ సెక్రెటరీతో ఎంపి భేటీ

నిజామాబాద్‌, జూలై 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అగ్రికల్చర్‌ సెక్రెటరీ సంజయ్‌ అగర్వాల్‌లో నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ధర్మపురి బుధవారం భేటీ అయ్యారు. అగ్రికల్చర్‌ సెక్రటరీ కార్యాలయంలో జరిగిన భేటీలో వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు. కాగా పసుపు పంటపై విస్తృతంగా చర్చించారు.

రెండు వారాల్లో ఇంటిగ్రేటెడ్‌ న్యూట్రియెంట్‌ మేనేజ్మెంట్‌ (పంట నాణ్యతను పెంచే కార్యక్రమం), పసుపు పంటకు సంబంధించిన సమగ్ర విశ్లేషణ కోసం సమావేశం ఏర్పాటు చేయనున్నారు. సమావేశంలో ఎంపీ అర్వింద్‌ ధర్మపురితో పాటు మరో ఇద్దరు రైతులకు పాల్గొనే అవకాశమున్నట్టు తెలిసింది.

Check Also

పూడికతీత పనుల‌ పరిశీల‌న

నిజామాబాద్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 1 నుండి 8 వ తేదీ వరకు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *