Breaking News

నీటి సంరక్షణలో మహిళల పాత్ర కీలకం

నిజామాబాద్‌, జూలై 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీటితోనే మానవ భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. జలశక్తి అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా బుధవారం అంకుశాపూర్‌ గ్రామంలో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటిపోతున్న తరుణంలో వర్షపునీటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా భూగర్భ జలాలను పెంపొందించేందుకు దష్టి పెట్టకపోతే మానవ మనుగడ కు కష్టతరమని జల సంరక్షణలో అందరు భాగస్వాములు అయినప్పుడే సాధ్యమవుతుందని ఇది ఒక ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే సాధ్యం కాదని, జల సంరక్షణ పద్ధతుల పట్ల అవగాహన కల్పిస్తుంది.

గతంలో చేపట్టిన పథకాలను పునరుద్ధరణ, నూతనంగా చేపట్టేందుకు నిధులు, సహాయ సహకారాల కొరకు కషి చేస్తామని, ప్రజలు ప్రజా ప్రతినిధుల తోడు అధికార యంత్రాంగం సమిష్టి కషి ఉంటేనే ఏదైనా సాధ్యం, విజయవంతం అవుతాయని చెప్పారు. నీటి సంరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ఉపాధి హామీ పథకం ద్వారా ఇతర పథకాల ద్వారా చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగిందని, మరిన్ని నీటి సంరక్షణ పథకాలు ఎంతో ఆవశ్యకత ఉందని, దాన్ని దష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేసే జలశక్తి అభియాన్‌ ద్వారా పూర్తి చేస్తామని, దేశంలో 256 జిల్లాలను ఎంపిక చేయగా అందులో మన జిల్లా కూడా ఉందని, ఈ పథకం అమలులో బ్లాక్‌ వారీగా గుర్తించి పకడ్బందీగా అమలు చేసేందుకు ముందస్తు కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేయడం జరిగిందన్నారు.

ఈ ప్రణాళిక దేశంలోనే మొదటి స్థానం పొందిందని అమలులో కూడా ప్రథమ స్థానం పొందేందుకు తమ వంతు భాగస్వామ్యం, సహకారం సమిష్టి కషి ఎంతో అవసరమని చెప్పారు. వాతావరణ సమతుల్యతకు చెట్ల యొక్క ఆవశ్యకత ప్రధానంగా ఎంతో ఉందని భావించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో విరివిరిగా మొక్కలు నాటాలని కోరారు. జలశక్తి అభియాన్‌ నోడల్‌ అధికారి నికుంజా కిషోర్‌ సుందరాయ్‌ మాట్లాడుతూ వర్షపునీటిని సద్వినియోగం చేసుకుని భూగర్భ జలాలను పెంపొందించే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నందున ప్రజలు ప్రజా ప్రతినిధులు అందరు భాగస్వాములై బాధ్యత వహిస్తేనే ఈ పథకం నిర్దేశించిన లక్ష్యానికి చేరుకుంటుందని చెప్పారు.

జులై 1 నుండి వంద రోజుల పాటు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు, ప్రతి నీటి చుక్కను ఉపయోగించుకుని భూగర్భ జలాలను పెంపొందించే దిశగా ముందుకుపోవాలని అన్నారు. సమాజంలో మహిళలు సగభాగం అయినందున జల సంరక్షణలో కూడా మహిళల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. మహిళల సహకారం భాగస్వామి లేనిదే ఏ కార్యక్రమమైన విజయవంతం కాదని చెప్పారు. ఈ గ్రామానికి రావడం ఎంతో సంతోషదాయకమని తెలిపారు. జనశక్తి అభియాన్‌ వంద రోజుల పాటు అమలు చేస్తారని దేశంలోని మొదటి స్థానంలో జిల్లా నిలవాలంటే అందరూ కలిస్తేనే పేరు వస్తుందని నీటి సంరక్షణలో ముందంజలో ఉండేందుకు కషి చేయవలసిన అవసరం ఎంతో ఉందన్నారు.

ఈ సమావేశం సందర్భంగా జల సంరక్షణ ప్రాధాన్యతను గుర్తిస్తూ పాడిన గాయకుడు గంగాధర్‌ను జలశక్తి సారథిగా నియమిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌, జిల్లా కలెక్టర్‌, నోడల్‌ అధికారిని శాలువాతో సన్మానించారు. గ్రామపంచాయతీ హైస్కూల్‌ ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం శ్రీ దత్త ఆశ్రమంలో దేవాలయాలను సందర్శించారు. సమావేశంలో డిఆర్‌డివో రాథోడ్‌ రమేష్‌, డిడి గ్రౌండ్‌ వాటర్‌ ప్రసాద్‌, డిడి హార్టికల్చర్‌ నర్సింగ్‌ దాస్‌, తహసిల్దార్‌, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.

Check Also

పనుల‌ పురోగతి బాగుంది

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందల్వాయి, గన్నారంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను ...

Comment on the article