Breaking News

సభ్యత్వ నమోదు ఉద్యమంలా సాగాలి

రెంజల్‌, జూలై 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉద్యమంలా ముందుకు సాగాలని ఎమ్మెల్సీ ఫారుక్‌ హుస్సేన్‌ పిలుపునిచ్చారు. మండలంలోని సాటాపూర్‌, రెంజల్‌ గ్రామాల్లో టిఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భూమారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన టిఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పలువురికి సభ్యత్వ నమోదు పత్రాలను అందజేశారు. అనంతరం ఫారుక్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ నాయకత్వంలో టిఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదును నాయకులు కార్యకర్తలు ఉద్యమంలా ముందుకు సాగి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, పార్టీ బలోపేతానికి కషి చేయాలని అన్నారు.

పార్టీ సభ్యత్వంలో నియోజకవర్గంలో రెంజల్‌ మండలం ముందంజలో ఉండే విధంగా ప్రతి ఒక్కరు సభ్యత్వాలను నమోదు చేయించి మండలాన్ని ముందంజలో ఉండేందుకు కషి చేయవలసిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. సభ్యత్వంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి అవగాహన కల్పించాలని పార్టీ సభ్యత్వం పొందిన వారందరికీ ప్రమాద బీమా రెండు లక్షలు కల్పిస్తుందని అన్నారు. గత ప్రభుత్వాలు 70 ఏళ్ళలో చేయని అభివద్ధిని కెసిఆర్‌ అనతికాలంలోనే చేసి చూపించారన్నారు.

మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను ఓడించిన ప్రజలు ఇప్పుడు మాయమాటలు చెప్పి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన ఎంపీ ధర్మపురి అరవింద్‌ మాటలే తప్ప చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలంటే అది టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికె సాధ్యమవుతుందన్నారు.

Check Also

జనహిత పెండింగ్‌ దరఖాస్తులు పరిస్కరించాలి

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనహితలోని పెండింగ్‌ దరఖాస్తులను అదికారులు వెంటనే పరిశీలించి పరిస్కరించాలని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *