Breaking News

నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ జన్మదిన వేడుకలు

నిజాంసాగర్‌, జూలై 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు జలాశయాన్ని నిర్మించిన చీఫ్‌ ఇంజనీర్‌ నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ జన్మదిన వేడుకలను గురువారం నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ 12 వరద గేట్ల సమీపంలోని గార్డెన్‌లో ఏర్పాటుచేసిన చీఫ్‌ ఇంజనీర్‌ విగ్రహానికి ప్రాజెక్టు డిప్యూటీ ఈఈ దత్తాత్రి, ఏఈఈ శివకుమార్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం డిప్యూటీ ఈఈ మాట్లాడుతూ నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మించి రెండు లక్షల 75 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి దోహదం చేశారన్నారు.

అప్పటి కట్టడాలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. చీఫ్‌ ఇంజనీర్‌ ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఎంతో మంది రైతు కుటుంబాలకు లాభం చేకూరిందన్నారు. ప్రాజెక్టు 12, 16, 20 వరద గేట్లతో పాటు ప్రధాన కాలువ గేట్లను ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ప్రాజెక్టు నిర్మించిన చీఫ్‌ ఇంజనీర్‌ రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో వర్క్‌ ఇన్స్‌పెక్టర్‌ పోశెట్టి, సిబ్బంది లక్ష్మయ్య, మాధవి, శ్రీశైలం, కనుక రాజు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మండల క్రీడా పోటీలు ప్రారంభం

నందిపేట్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల అంతర పాఠశాలల క్రీడలు వెల్మల్‌ ప్రభుత్వ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *