Breaking News

గోడప్రతుల ఆవిష్కరణ

ఆర్మూర్‌, జూలై 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐఎఫ్‌టియు రాష్ట్ర సదస్సు ఈనెల 16 తేదీన హైదరాబాదు విజ్ఞాన కేంద్రంలో వనమాల కష్ణ అధ్యక్షతన ఉంటుందని ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముత్తన్న, దాసు, సూర్య శివాజీ చెప్పారు. ఈ మేరకు ఆర్మూర్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ కార్మికులకు ఉపాధి భద్రత కల్పించి, రాష్ట్రంలో ఉద్యోగాల భర్తి ప్రక్రియను కొనసాగించి, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని కెసిఆర్‌ ఇచ్చిన హామీ ఏమైందని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో 70 రకాల జీవోలు సవరించి ఉద్యోగ కార్మికులకు అండగా నిలవాలని ఐఎఫ్‌టియు సదస్సు నిర్వహిస్తుందని, సదస్సులో మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని దాసు తెలిపారు.

Check Also

జనహిత పెండింగ్‌ దరఖాస్తులు పరిస్కరించాలి

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనహితలోని పెండింగ్‌ దరఖాస్తులను అదికారులు వెంటనే పరిశీలించి పరిస్కరించాలని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *