Breaking News

రాష్ట్ర సదస్సు జయప్రదం చేయండి

ఆర్మూర్‌, జూలై 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ మరియు అవుట్సోర్సింగ్‌ ఉద్యోగ కార్మికులకు చెందిన వివిధ జీవోలను సవరించి, పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగ, కార్మికుల వేతనాలను పెంచాలని దాసు అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఐఎఫ్‌టియు రాష్ట్రసదస్సు గోడపత్రికలను ఆవిష్కరించారు. సదస్సులో ముఖ్యవక్తగా మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ ప్రసంగిస్తారని, ఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కష్ణ, సూర్యం పాల్గొంటారని, రాష్ట్రంలోని ప్రభుత్వ అనుబంధ కార్మిక సంఘాల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొంటారని దాసు తెలిపారు.

దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2016 అక్టోబర్‌ 26 తేదీన సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు ఇచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకుండా ఉద్యోగ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని దాసు ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టర్‌ ఆవిష్కరణలో ఐఎఫ్‌టియు మరియు తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ జక్రాన్‌పల్లి మండల కమిటీ భానుచందర్‌, నాయకులు సొప్పరి గంగాధర్‌, శ్రీనివాస్‌ రెడ్డి, గోవర్ధన్‌, భూదేవి, జీవన్న, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Check Also

జనహిత పెండింగ్‌ దరఖాస్తులు పరిస్కరించాలి

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనహితలోని పెండింగ్‌ దరఖాస్తులను అదికారులు వెంటనే పరిశీలించి పరిస్కరించాలని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *